రైతులకు టార్పాలిన్ కవర్లు అందజేత.

దౌల్తాబాద్ మండల పరిధిలో ముబారస్ పూర్ గ్రామం లో ఐకెపి కొనుగోలు సెంటర్లలో ఫార్మా పాస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐకెపి సెంటర్లో కొనుగోలు చేసి నిల్వచేసిన ధాన్యం తడవకుండా ఉండేందుకు సన్న చిన్న కారు మరియు కౌలు రైతులకు సుమారుగా 30 టార్పాలిన్ కవర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు గణేష్ మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లాలోని 50 వేల టార్పాలిన్ కవర్లను అందజేయడం జరుగుతుందన్నారు. గ్రామంలో సన్నా చిన్న కారు రైతులు మరియు కౌలు రైతులు అప్పుల బారిన పడుతుందన్న ఉద్దేశంతో ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ అధ్యక్షులు చక్రధర్ ఆదేశాల మేరకు తార్పాల్లను అందజేయడం జరుగుతుందని తెలిపారు. దేశానికి అన్నం పెట్టే రైతు అప్పుల పాలు అవుతున్నదని గమనించి ఇకనైనా సన్న చిన్న కారు, కవులు రైతులు ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైకుంఠం, బోట్క లక్ష్మణ్ గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు.