రైతులకు మద్దతు ధర దక్కేనా?
కౌలు రైతుకు మిగిలేది గుండు సున్నే
రైతును పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం
శివ్వంపేట అక్టోబర్ 18 జనంసాక్షి : వడ్లు కొనుగోలు చేసి దాన్ని ధాన్యంగా మార్చి ఆ ధాన్యాన్ని పండించడం కోసం ఆరుగాలం చెమటోడ్చి, దుక్కి దున్ని, నీరు పెట్టి, అన్ని రకాల పెట్టుబడి ఖర్చులు భరిస్తే, కౌలు రైతన్నకు చివరికి మిగిలేది గుండు సున్నే. గతంలో ఓ ముఖ్యమంత్రి వ్యవసాయం దండగ అంటే ఆయన మీద ఒంటి కాళ్లపై లేచిన నేటి ప్రధానమంత్రి మోడీ ముఖ్యమంత్రులు, మంత్రులు చివరకు వ్యవసాయ రంగానికీ ఓర్గపేట్టిందేమీ లేదు. ఒక ఎకరా పొలంలో వరిసాగు చేస్తే, వరి ధాన్యం దిగుబడి సరాసరి 21 క్వింటాళ్లు, దీనికి ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలకు రూ. 1980 మొత్తం. రైతుకు వచ్చే ఆదాయం మొత్తం రూ. 41, 500లు వస్తుంది. అయితే ఆరు నెలల కాలానికి రైతుకు అయ్యే అన్ని రకాల పెట్టుబడులను ఒకసారి పరిశీలిస్తే వాస్తవిక పరిస్థితులు తెల్వక మానదు. ఒక ఎకరా వట్టికి దున్నకం, కల్టివేటర్ రెండు గంటలకు రూ.1600, విత్తనాలు ఎకరానికి రూ. 1600, బురదలో టాక్టర్ దున్నడానికి ఎకరాకు రూ. 3000, రెండు డీఏపీ బస్తాలకు ఎకరాకు రూ. 2800, వరి నాటు వేయడానికి ఎకరానికి రూ. 6000 లు రెండు యూరియా బస్తాలు ఎకరానికీ రూ.600 కలుపు మందులకు ఎకరానికి రూ. 1000 లు, వరి కోత మిషన్ గంటన్నరకు రూ. 3300లు, మిషన్ కోసిన ధాన్యాన్ని ట్రాక్టర్లు తరలించడానికి ఒక ట్రిప్పు కు రూ. 500 లు, వరి ధాన్యం ఆరబెడితే టార్పాలిన్లకు రూ. 1000, ధాన్యంలో ఉన్న దుమ్ము ధూళి, తాళ్లు యంత్రము ద్వారా తొలగించుటకు రూ. 1000, హమాలీలకు రూ. 1800 ఇలా మొత్తం పెట్టుబడుల వ్యయం 24,200 లు అవుతుంది. ఈ విధంగా మొత్తం పెట్టుబడులు వ్యయం పోను భూ యజమాని రైతుకు మిగిలేది రూ. 17, 300 లు మాత్రమే. ఇది కేవలం భూమి ఉన్న రైతుకు మాత్రమే. అదే కౌలు రైతు భూ యజమానికి 40 శాతం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే సుమారుగా రూ. 8000 రూపాయలు, ఇక కౌలు రైతుకు కేవలం రూ.12, వేలు మాత్రమే మిగులుతుంది. భూ యజమాని రైతుకు ఆరు నెలల కాలానికి గాను నెలకు రూ.3000 రూపాయల మిగులు తుంది. అతని సంపాదన రోజుకు 100 రూపాయలు మాత్రమే. ఇక కౌలు రైతు పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ఇతని సంపాదన రోజుకి 70 రూపాయలు మాత్రమే. గృహ నిర్మాణ కార్మికులు లేదా రోజువారి కూలీలు తెలంగాణలో ప్రస్తుతం రోజుకు వారి సంపదన రూ.500 లకు తగ్గకుండా ఉన్నది. అంటే వీరి సంపాదన నెలకు రూ.15000 రైతులకు ఈ విషయం తెలుసు కానీ తరతరాలుగా వ్యవసాయం చేస్తూ, ఉన్న వీరు దానిని వదులు కోలేరు. కానీ భవిష్యత్తులో వీరికి విసుగు వచ్చి వ్యవసాయాన్ని వదులుకుంటే కాళేశ్వరం, మల్లన్నసాగర్, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ఎంత నిండుకుండలా ఉన్నా, తెలంగాణలో ఉన్న అందరికీ తినడానికి తిండి గింజలేని దుస్థితి రావడానికి ఎంతో కాలంపట్టదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగంలో కొనసాగుతున్న వాస్తవా పరిస్థితులను, ఖర్చులను అంచనా వేసి రైతులకు సరైన మద్దతు ధరను నిర్ణయించాలి. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వ ప్రకటనలు చూస్తే రైతులకు నవ్వాలో ఏడువాలో కూడా తెలియడం లేదు. ప్రతి సంవత్సరం వరికి మద్దతు ధర పెంచుతున్నాం అంటారు. కానీ వారు పెంచేది కేవలం 100 రూపాయల లోపు మాత్రమే దీనికి డప్పు ప్రచారము, సొల్లు పురాణం, ప్రచార హార్భాటాలు, ఊక దుంపుడు, ఉపన్యాసాలు ఇప్పటికైనా ప్రధానమంత్రి, కేంద్ర వ్యవసాయ మంత్రి, కేంద్ర ఆహార ఉత్పత్తుల మంత్రి, కేంద్ర ఎరువుల మంత్రి, ఆర్థిక మంత్రులు మేలుకొని రైతులకు సరైన సహాయం అందించకపోతే అన్నపూర్ణ అనిపించుకున్న రెండు తెలుగు రాష్ట్రాల నేల అడవి లాగా మారడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. రైతుల పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసి దానిని బియ్యంగా మార్చి విదేశాలకు ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం పుష్కలంగా ఉన్న దానిని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు. ఇప్పుడు బియ్యం తీసుకొం రా రైస్ తీసుకురా సప్పడి బియ్యం తీసుకుంటాం కొర్రీలు పెట్టడమే తప్ప తెలుగు రైతులకు కేంద్రం చేసింది ఏమీ లేదు. ఈ విషయంపై ఇప్పటికైనా రైతన్నలు పునరాలోచించి ఎవరు ఏం చేస్తున్నారో గ్రహించాలి అప్పుడే మనకు వాస్తవిక పరిస్థితులు తెలువక మానదు.

Attachments area