రైతులకు రుణమాఫీ వెంటనే చేయాలి
బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు బయ్యని చంద్రశేఖర్
మోత్కూరు జూలై 17 జనంసాక్షి : అకాల వర్షంతో నష్టపోయిన రైతన్నలను ఆదుకుంటూ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీని వెంటనే చేయాలని భారతీయ జనతా పార్టీ యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడు బయ్యని చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాగానే రైతులకు లక్ష లోపు రుణాలను వెంటనే మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఇంతవరకు కూడా రైతులకు ఎలాంటి రుణమాఫీలు చేయకపోగా ఇచ్చిన రుణాలకు వడ్డీలు వసూలు చేస్తూ రైతాంగాన్ని అన్ని రకాలుగా మోసం చేస్తుందని విమర్శించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుదాటు ధరలు కల్పించకపోగా ,ఉచిత ఎరువులు అందిస్తానని హామీ ఇచ్చి వాటిని కూడా ఇవ్వకపోగా ,అర్థం పర్థం లేని హామీలు ఇస్తూ రైతులకు తీరని అన్యాయం చేస్తుందని విమర్శించారు. వర్షాలు వచ్చి ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతుంటే టిఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా ప్రజలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేయనట్లయితే బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉందని ప్రభుత్వానికి హెచ్చరించారు.కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచితబియ్యాన్ని కూడా పంపిణీ చేయలేని అద్వాన స్థితిలో రాష్ట్ర ప్రభుత్వము ఉందని విమర్శించారు.ఉద్యోగస్తులను ,నిరుద్యోగులను మోసం చేస్తూ కాలయాపన చేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు అతి దగ్గరలో ఉన్నాయని ,ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న బిజెపి నాయకులపై టిఆర్ఎస్ గుండాల దాడులను భారతీయ జనతా పార్టీ ఖండిస్తుందని ఇకపై దాడులు చేస్తే సహించేది లేదని తాము కూడా ఎదురుదాడులకు సిద్ధమని హెచ్చరించారు.
Attachments area