రైతులకు వడ్డీలేని రుణాలు: సీఎం

మెదక్‌: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. మెదక్‌ జిల్లాలో మూడు రోజుల ఇందిరమ్మబాట కార్యక్రమాన్ని సీఎం ఈ ఉదయం ప్రారంభించారు.. దుబ్బాకలో ఇందిర జలప్రభ లబ్ధిదారులతో సీఎం సమావేశమయ్యారు. రైతులకు రూ. లక్ష వరకు వడ్డీలేని రుణాలను ఖరీఫ్‌ నుంచి అమలు చేయనున్నట్లు తెలియజేశారు. వచ్చే రేండేళ్ల్లలో 30 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు  అన్నారు.