రైతులు ఎదుగుతుంటే ఓర్వలేని రేవంత్ రెడ్డి
వచ్చే ఎలక్షన్ లో రైతులు కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పుతారు
మరోసారి తెలంగాణ రైతాంగంపై కారుకూతలు కూస్తే ఖబర్దార్
చొప్పదండి, జూలై 21 (జనం సాక్షి):
రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ మరోసారి బయటపెట్టిందని ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ అన్నారు. చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ లో రైతు వేదికలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కర్షకులకు 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దంటూ ప్రకటించిన కాంగ్రెస్ దుర్మార్గపు ఆలోచన చేస్తుందని దుయ్యబట్టారు. గతంలోనూ రైతులకు విద్యుత్ ఇవ్వకుండా గోస పెట్టారని7 విమర్శించారు. కాంగ్రెస్ ఆలోచనల్ని తెలంగాణ రైతులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. హస్తం పార్టీ వ్యవసాయ, రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారని అన్నారు.
రైతులకు మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీ అని,దేశంలో వ్యవసాయ రంగాన్ని నాశనం చేసింది హస్తం పార్టీ అని మండిపడ్డారు.
గతంలో రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ కక్షపూర్తిత పాలన చేసిందన్నారు. గతంలో రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ హామీని ఆ పార్టీ విస్మరించిందని దుయ్యబట్టారు. వైఎస్‌ఆర్ హయాంలో 9 గంటల విద్యుత్ ఇవ్వట్లేదని రైతులు ధర్నాలు చేశారని అన్నారు.
‘రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే కాంగ్రెస్ కు ఎందుకు ఏడుపు అని,
ప్రజలకు ఏదీ ఉచితంగా ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్‌కు లేదని,
కాంగ్రెస్ నేతలు రైతు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని, సాగుకు 3 గంటల ఉచిత విద్యుత్ చాలని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు ఇంట్లో 24 గంటల విద్యుత్ ఉండాలి. రైతులకు మాత్రం 24 గంటల విద్యుత్ ఉండవద్దా? కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల దుర్మార్గపు ఆలోచనలు చేస్తోందని, తెలంగాణ రైతులకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి వ్యతిరేకంగా రైతులతో కలిసి తీర్మానాలు చేశామన్నారు .
కాంగ్రెస్ రైతుబంధు, కాళేశ్వరం ప్రాజెక్టూ వద్దంటుందని,
రైతులకు ఉచిత విద్యుత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి… రానున్న రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుబంధు సైతం వద్దంటారని అన్నారు.
పీసీసీ అధ్యక్షుడు వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోని రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే ధరణి ఎత్తివేస్తామన్న రేవంత్.. ప్రకటనతో రైతులు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
అజ్ఞానంతో రైతులకు మూడు గంటల విద్యుత్ సరఫరా సరిపోతుందన్నారని ఆక్షేపించిన రేవంత్ రెడ్డి, 24 గంటల ఉచిత విద్యుత్‌తో దేశానికి అన్నం పెట్టేలా తెలంగాణ రైతులు ఎదిగారని వివరించారు. 65 ఏళ్ల పాలనలో 50 ఏళ్లు దాదాపు వాళ్లే పాలించారని కాలేశ్వరం లాంటి జలాశయాన్ని నిర్మాణం చేద్దామని మనకు వాళ్లకు ఆలోచన రాకపోగా ఇప్పుడు వచ్చినటువంటి తెలంగాణలో జరుగుతున్నటువంటి రైతు శ్రేయస్సు ధ్యేయంగా జరుగుతున్న కార్యక్రమాలకు భయపడి రాష్ట్రంలో తాము కనుమరుగవుతామన్న భయంతోటి పిచ్చి కూతలు కూస్తున్నాడని ఆయనకు తెలంగాణ ప్రజలు గట్టిగా సమాధానం ఇస్తారని పేర్కొన్నారు కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, సింగిల్ విండో చైర్మన్ మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, ఆర్బిఎస్ మండల కన్వీనర్ గుడిపాటి వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు బందార అజయ్ కుమార్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు లోక రాజేశ్వర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.