రైతులు కన్నెర్రజేస్తే కేంద్ర సర్కారు ఖతమైతది
` వరిధాన్యం కొనాల్సిందే..
` బాధ్యతనుంచి పారిపోతే ఊరుకునేది లేదు
` తెలంగాణలో భారీ నిరసన
` వడ్లు కొంటామనే దాకా పోరాడుతాం
` బండి సంజయ్ కాదు..తొండి సంజయ్
` సిరిసిల్ల ధర్నాలో మంత్రి కెటిఆర్ వెల్లడి
` బిజెపికి రాజకీయాలు తప్ప రైతులపై ప్రేమలేదు
` ధర్నాలో మండిపడ్డ మంత్రి నిరంజన్ రెడ్డి
` కేంద్రంపై యుద్ధం మొదలయ్యింది
` వడ్లు కొనమంటే రైతుల గతేం కాను
` సిద్ధిపేట ధóర్నాలో నిలదీసిన మంత్రి హరీష్ రావు
` ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదే
` పాలమూరు ధర్నాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్
` పంజాబ్‌కో రూల్.. మాకో రూలా ?
` ఖమ్మం ధర్నాలో నిలదీసిన మంత్రిపువ్వాడ
హైదరాబాద్,నవంబరు 12(జనంసాక్షి): కేంద్రం యాసంగి వడ్లు కొంటామనే దాకా బీజేపీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ మెడలు వంచాము.. వరి కొనుగోలు కోసం బీజేపీ మెడలు వంచలేమా అని కేటీఆర్ అన్నారు. రైతుల వెంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సిరిసిల్ల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతుల మహా ధర్నాలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. బీజేపీ నేత బండి సంజయ్ కాదు తొండి సంజయ్. యాసంగిలో వరే వేయండి అంటున్న తొండి సంజయ్. బండి సంజయ్‌ను గెలిపించి నోళ్లకి ఓ దండం. ఇలాంటి పిచ్చోళ్లని పార్లమెంట్‌కి పంపించారు. హిందూ`ముస్లిం పేరుతో ఆగం చేయటమే బీజేపీ పనని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రైతు ఏడిస్తే రాజ్యం బాగుపడదని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. సిరిసిల్లలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి ఏడున్నరేళ్ల తర్వాత రైతులు రోడ్డెక్కారని తెలిపారు. ఏడు దశాబ్దాల వెనుకబాటును ఏడాదిలో సీఎం కేసీఆర్ మార్చారని కొనియాడారు. ఏడేళ్ల వరుస కరవు నుంచి ఏడేళ్లలో అభివృద్ధిబాటలో నిడిపించారని కేటీఆర్ తెలిపారు. చిన్ననీటి వనరుల రూపురేఖలు సీఎం మార్చారని ప్రశంసించారు. కేసీఆర్ ఏడేళ్ల పాలనలో చెరువులు తెగకుండా చూసుకున్నామన్నారు. 3 కోట్ల ఆహారధాన్యాలను తెలంగాణ పండిస్తున్నదని తెలిపారు. అన్నీ అమ్మటమే ప్రధాని మోదీ ఆలోచన అని దుయ్యబట్టారు. ప్రపంచంలో అతిపెద్ద లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరమని పేర్కొన్నారు. డెల్టాలో కనిపించే పరిస్థితులు
తెలంగాణలో కనిపిస్తున్నాయన్నారు. ఆకలి సమస్య ఎదుర్కొంటున్న దేశాలలో ముందంజలో భారత్ ఉందని తెలిపారు. గత 75 ఏళ్లలో దేశాన్ని ఎలా నడిపించారో బీజేపీ, కాంగ్రెస్ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఈ ధర్నాల్లో కనిపిస్తోంది అని కేటీఆర్ అన్నారు. ఉద్యమం నాటి జోష్ మళ్లీ వచ్చింది. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న రైతు వ్యతిరేక విధానాలను ఈ ఏడున్నరేళ్లలో తుడిచి పెట్టగలిగామన్నారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఎరువులు, విత్తనాలకు లైన్లు కట్టే పరిస్థితి లేదు. సకాలంలో రైతులకు ఎరువులు, విత్తనాలు అందిస్తున్నాం. పాలకుల మనసు బాగుంటే అన్ని బాగుంటాయని కేటీఆర్ పేర్కొన్నారు. చెరువులకు రూ. 20 వేల కోట్లు ఖర్చు పెట్టి భూగర్భ జలాలను పెంచుకున్నామని తెలిపారు. నడి ఎండకాలంలోనూ చెరువులు మత్తడి దుంకుతున్నాయని కేటీఆర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాలంతో పోటీ పడి కేసీఆర్ నిర్మించారు. రైతులకు ఏ కష్టం రాకుండా సీఎం కేసీఆర్ చూసుకుంటున్నారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ను తెలంగాణ మించిపోయింది. సాప్ట్‌వేర్ ఇంజినీర్లు గ్రామాల బాట పట్టి వ్యవసాయం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాత విధానాల వల్లే ఇది సాధ్యమవుతుందన్నారు. దిక్కు మాలిన కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ వచ్చాక ఆత్మహత్యలు తగ్గాయని పార్లమెంట్ సాక్షిగా మోడీ ప్రభుత్వమే చెప్పింది అని కేటీఆర్ గుర్తు చేశారు. రైతును రాజు చేయాలన్నదే కేసీఆర్ తపన అని ఆయన స్పష్టం చేశారు. బండి సంజయ్ తొండి సంజయ్‌లాగా మారారు అని ధ్వజమెత్తారు. బండి పాదయాత్ర చేసినప్పుడు మన రైతు వేదికల్లో బస చేశారని గుర్తు చేశారు. వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉంది.. రాజ్యాంగం ప్రకారం ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు.తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. మన రైతుబంధును కేంద్రం సహా 11 రాష్టాల్రు కాపీ కొట్టాయన్నారు. రైతు చనిపోయిన పది రోజుల్లోపై రైతుబీమా కింద రూ. 5 లక్షలు ఇస్తున్నాము. తెలంగాణలో ప్రాజెక్టుల ఫలితంగా ధాన్యం ఉత్పత్తి పెరగగానే కేంద్రం కొర్రీలు పెడుతోంది అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు వరి పంట వేయడం తప్ప వేరేది రాదని మన రైతులు అంటున్నారు. కేంద్రం మాత్రం వరి వద్దు అంటోంది. పంజాబ్‌కో న్యాయం.. తెలంగాణకు ఓ న్యాయమా..? అని ప్రశ్నించారు. దేశానికి ఒక్క విధానం ఉండనవసరం లేదా? అని అడిగారు. బీజేపీ ఓట్ల కోసం రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. చిల్లర ఓట్ల కోసం రైతుల జీవితాలతో బీజేపీ చలి మంటలు కాచుకుంటోంది అని నిప్పులు చెరిగారు. బీజేపీ రాజకీయాలకు ధీటుగా సమాధానం చెప్తామన్నారు.
బిజెపికి రాజకీయాలు తప్ప రైతులపై ప్రేమలేదు:మంత్రి నిరంజన్ రెడ్డి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రాజకీయాలు తప్ప రైతాంగం విూద ప్రేమ లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. నూతన వ్యవసాయ చట్టాలతో ప్రధాని మోదీ రైతుల మెడలకు ఉరితాళ్లు పేనుతున్నాడని నిరంజన్ రెడ్డి విమర్శించారు. రైతుల నుంచి యాసంగి వరి ధాన్యాన్ని కొనడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకు నిరసనగా.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు చేపట్టిన రైతు ధర్నాలో మంత్రి పాల్గొని మాట్లాడారు. యాసంగి వడ్లు కొంటామని కేంద్రంతో రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పించాలని సవాల్ చేశారు. లేదంటే కారణాలు చెప్పాలనన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రైతుల విూద మనస్సులేదు. వ్యవసాయం అంటే తెలివి లేదు. దేశ ప్రజల ఆస్తులు అమ్మడం తప్ప రైతుల వడ్లు కొనే విధానం లేదని ఘాటుగా విమర్శించారు. దేశంలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను మించిన రాష్ట్రం లేదని మంత్రి పేర్కొన్నారు. దేశంలో పండిన పంటను కేంద్రం కొనుగోలు చేయాలని రాజ్యాంగం చెబుతున్నది. అయినా బీజేపీ ప్రభుత్వం మొండిగా ప్రవరిస్తున్నదని మండిపడ్డారు.దేశ ఆస్తులన్నీ అంబానీ, ఆదానీలకు తాకట్టు పెడుతూ రైతుల నోళ్లలో మట్టికొట్టే చట్టాలు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. విూ వల్ల దేశంలో 600 మంది రైతులు చనిపోయారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లు కొనుగోలు చేయాలని డిమాంచ్ చేశారు. టీఆర్‌ఎస్ రైతు సంక్షేమం కోసం పని చేస్తున్న ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీకి నూకలు చెల్లడం ఖాయమన్నారు. కేంద్రం ధాన్యం కొనేంత వరకు ఉద్యమిస్తామని మంత్రి తెలిపారు.
కేంద్రంపై యుద్దం మొదలయ్యింది:మంత్రి హరీష్ రావు
కేంద్రంపై యుద్దం మొదలయ్యిందని..ఇది ఆరంభంమాత్రమే అని..ఇక మున్ముందు పోరాటం ఉధృతం చేస్తామని మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. కేంద్ర వైఖరితో రైతన్నలు ప్రమాదంలో పూడ్డారని అన్నారు. ధాన్యం కొనబోమని చెబితే రైతులు తము పండిరచిన పంటను ఏం చేయాలన్నారు. వడ్లు కొనుగోలు చేయబోమని తేల్చిచెప్పిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్ మహా ధర్నా చేపట్టింది. సిద్దిపేటలో జరిగిన ధర్నాలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోరాటం ఇప్పుడే మొదలైంది.. ఇది ఆరంభమే.. మున్ముందు మరింత ఉదృతం చేస్తామని కేంద్రాన్ని మంత్రి హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ అసమంజస విధానాలు తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారుతున్నాయని మండిపడ్డారు. ఏడేళ్ల టీఆర్‌ఎస్ హయాంలోనే రైతులకు మేలు జరుగుతున్నదని.. నేడు కాళేశ్వరంతో ఏ ఊర్లో చూసిన చెరువులు అన్ని నిండు కుండల్లా కళకళలాడుతున్నాయని హరీష్ చెప్పుకొచ్చారు. గోదావరి జలాలను గ్రామాలకు తరలించిన ఘనత సిఎం కెసిఆర్‌దన్నారు. రైతులు జర బాగుపడుతుంటే కేంద్రం యాసంగిలో వడ్లు కొనమంటున్నారు. యాసంగిలో తెలంగాణలో దొడ్డు వడ్లు పండుతాయి.. అవి బాయిల్డ్ రైస్‌కే పనికి వస్తాయి. పంజాబ్‌లో మొత్తం వడ్లు మొత్తం ఎలా కొంటారు..?.. తెలంగాణలో ఎందుకు కొనరని ప్రశ్నించారు. దేశంలో రైతుకు పెట్టుబడి సాయం, బీమా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఒక్క వ్యవసాయం విూదనే ప్రభుత్వం 30 వేళ కోట్లు ఖర్చు చేస్తున్నది. నాడు రైతు కళ్ళల్లో కన్నీళ్లే.. నేడు ఏడేళ్ల టీఆర్‌ఎస్ హయాంలో ఎక్కడ చూసినా నీళ్లే.. నీళ్లు. ఆంధ్రలో సీఎం జగన్.. కేంద్ర సర్కారు నిబంధనలు అనుసరించి బాయిల కడా విూటర్లు పెట్టిండ్లు. ఒకప్పుడు దేశంలో జై జవాన్ జై కిసాన్ నినాదం ఉండేది.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నై కిసాన్ అంటున్నది. దేశంలో వడ్లు కొనాల్సిన భాద్యత కేంద్రానిదే.. స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటి సారి వడ్లు కొనబోమని చెప్పిన ఘనత బీజేపీదే. ’ఇప్పటికైనా కేంద్రం పద్ధతి మార్చుకోకపోతే.. రైతుల కోపాగ్నికి కమలం వాడిపోక తప్పదన్నారు. ప్రశ్నించే రైతులపై ఉగ్రవాద ముద్ర వేస్తున్నారు. గాంధీని చంపిన గాడ్సేను దేశభక్తుడని అనడం దేశభక్తా..?’ అని కేంద్రంపై తీవ్రస్థాయిలో హరీష్ మండిపడ్డారు. వడ్లు కొనాలని రైతులు.. ప్రధాని మోదీకి ట్వీట్లు చేయాలని ఈ సందర్భంగా హరీష్ సూచించారు. అంతరం కసలి పోరాటం చేస్తనే కేంద్రం దిగి వస్తుందన్నారు.
ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదే:మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎట్టి పరిస్థితిలోనూ కేంద్రం వరిధాన్యం కొనుగోలు చేయాల్సిందే నని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అవసరమైతే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢల్లీి వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. వరి కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జడ్పీ గ్రౌండ్‌లో టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టి మంత్రి మాట్లాడారు. ఎన్నికలప్పుడు నరేంద్ర మోదీ, సుష్మ స్వరాజ్ ఇక్కడికి వచ్చి పాలమూరు `రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జాతీయ ప్రాజెక్ట్‌గా చేస్తామని అన్నారు. ఆ ఊసే మరిచారని విమర్శించారు. ఏడేళ్ల కాలంలో రాష్ట్రం, పాలమూరు ఎంతగా అభివృద్ధి చెందిందో చూడాలన్నారు. కర్ణాటకలోని రాయచూరును బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణాలో కలపాలన్నడు. నిజామాబాద్ జిల్ల సరిహద్దులోని 25 గ్రామాలు కూడా తెలంగాణాలో కలపాలని తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనమన్నారు. ఇక్కడ జరుగుతున్న అభవృద్ధి, సంక్షేమ పనులు విూరెందుకు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇక్కడి భూముల్లో ఏ పంటలు పండుతాయో వాటినే పండిస్తాం. ఇక్కడ ఎమైనా ఆపిల్ పండుతుందా అని ఎద్దేవా చేశారు. మేం వరి పంట సాగు చేస్తే విూరు కొనం అంటే ఎట్లా అని ప్రశ్నించారు. ఏ విషయంలోనైనా రాజకీయం చేయండి రైతుల విషయంలో మాత్రం రాజకీయాలు వద్దు అని హితవు పలికారు. ప్రజలను కాన్ఫ్యూజ్ చేయకండి. చేస్తే విూరు కన్ఫూజ్ అవుతారని మంత్రి తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కండ్లు తెరిచి రైతులు పండిరచిన యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మంత్రి తెలిపారు. మత్రి వెంట జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణమ్మ, జిల్లా టీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు. అంతకు ముందు తెలంగాణ చౌరస్తా నుంచి జడ్పీ వరకు ఎడ్ల బండ్లపై ర్యాలీ నిర్వహించారు. ఏడేళ్ల కాలంలో రాష్ట్రం, పాలమూరు ఎంతగా అభివృద్ధి చెందిందో చూడాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
పంజాబ్‌కో రూల్ మాకో రూలా ?:మంత్రిపువ్వాడ
తెలంగాణలో రైతులు పండిరచిన ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం కలెక్టరేట్ ముందు ధర్నా చౌక్‌లో టిఆర్‌ఎస్ నేతలు మహాధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్థానిక నేతలు పాల్గొన్నారు. ధర్నా చౌక్‌కు మంత్రి పువ్వాడ. ఎంపీ నామా, మాజీ ఎంపీ పొంగులేటి ఎడ్లబండిపై వచ్చారు. కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం , మేయర్ పునుకొల్లు నీరజ , మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న సూడా చైర్మన్ విజయ్ గారు, అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, రైతులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు..తెలంగాణ రైతులు పండిరచిన ధాన్యం కొనాలంటూ టీఆర్‌ఎస్ నాయకులు వరి నారుతో నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, తెలంగాణలో పండిన వరిధాన్యాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఖమ్మం నియోజకవర్గ కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డ్స్ ప్రదర్శనలతో నినాదాలతో ధర్నా ప్రాంగణం హోరెత్తింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరి పనలతో నినాదాలు చేశారు..ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ..కళ్లుండి చూడలేని.. చెవులు ఉండి వినలేని బిజెపి ప్రభుత్వానికి రైతుల ఉసురు తగలకపోదన్నారు. తెలంగాణలో ఏ పొలాల్లో పల్లేరు కాయలు కూడా మొలవదని అన్న భూముల్లో రెండు పంటలు పండుతున్నాయి అంటే అది తెరాస ప్రభుత్వ సూపరిపాలనకు నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 20వేలకు పై చిలుకు చెరువులను మిషన్ కాకతీయ పథకం ద్వారా పునరుద్ధరించి ప్రతి గ్రామాల్లో ప్రతి ఎకరానికి సాగునీరు అందేలా చర్యలు చేపట్టారన్నారు. ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాలు పెరిగి జల సంరక్షణ కార్యాచరణ చేసింది తెరాస ప్రభుత్వం అన్నారు. తెలంగాణ కు ఒక న్యాయం … పంజాబ్ కు ఒక న్యాయమా..? తెలంగాణ భారతదేశంలో భాగం కాదా…? అని ప్రశ్నించారు. తెలంగాణ రైతులు పండిరచిన వరి ధ్యాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొనదని, తెలంగాణ రైతులు పండిరచిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రైతుల పై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ఇంత కక్ష ఎందుకు..? కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని లేకుంటే విూకు పుట్టగతులు ఉండవన్నారు. తెలంగాణ రైతులు పండిరచిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొంటుందా … ? కొనదా…? స్పష్టం చేయాలన్నారు.. !రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయమంటే.. కార్లు ఎక్కించి చంపుతారా…? ఇది ఎక్కడి న్యాయం..? అని వ్యాఖ్యానించారు.రైతులు పండిరచిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత.. అది విూ విధి అని గుర్తుంచుకోవాలన్నారు. రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాడుదామని, కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు తిప్పి కొడదామన్నారు. కేంద్ర ప్రభుత్వామా కళ్ళు తెరువు. ఇప్పటికైనా తెలంగాణ రైతుల వరి ధాన్యం కొను అని రైతుల పక్షాన డిమాండ్ చేశారు.లేదంటే కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ నీతికి వ్యతిరేకంగా పోరాడుతాం అని హెచ్చరించారు. పంజాబ్ రైతుల వద్ద వరి ధాన్యం కొంటూ.. తెలంగాణ రైతుల వద్ద ధాన్యం ఎందుకు కొనరు..కేంద్ర ప్రభుత్వమా ఇదెక్కడి న్యాయం..? రైతులను దగా చేస్తే సహించేది లేదన్నారు.తెలంగాణ రైతుల ఐక్యత వర్ధిల్లాలని, కార్పోరేట్లకు కొమ్ముకాస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి చరమగీతం పాడాల్సివస్తుందన్నారు. రైతులను వంచిస్తున్న రాష్ట్ర బిజేపీ నాయకుల వైఖరిని ఎండగడదాం..!! జిల్లాలో కదలనియ్యం.. తిరగనియ్యం గుర్తుంచుకోవాలన్నారు. భారతీయ రaూటా పార్టీ..ఢల్లీి పెద్దల్లారా ..అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా ! వరి ధాన్యం కొనకుండా వంచిస్తారా..? అని ప్రశ్నించారు.పైకి దేశ భక్తి..! లోపల కార్పోరేట్ భక్తి…!! బిజెపి నేతల్లారా.. ఇదేనా విూద్వంద్వ నీతి.. ఇపుడు బయటపడిరది విూ బుద్ధి అని అన్నారు.రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని, రైతులను వంచించడమే దేశ భక్తా…! సిగ్గు..సిగ్గు .!రాష్ట్ర బిజెపి నేతలకు తెలంగాణ రైతులపై ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వరి ధాన్యాన్ని కొనిపించాలి అని పువ్వాడ సవాల్ విసిరారు.
తెలంగాణలో మార్మోగిన మోడీ వ్యతిరేక నినాదాలు
తెలంగాణ వ్యాప్తంగా మోడీ వ్యతిరేక నినాదాలు మార్మోగాయి. ధాన్యం కొనాల్సిందే అంటూ టిఆర్‌ఎస్ ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులు కదలి వచ్చాయి. ప్రతి నియోజకవర్గ స్థాయిలో టిఆర్‌ఎస్ ఆందోళనలకు ఊరూవాడా కలసి రావడంతో ధర్నాలు సక్సెస్ అయ్యాయి. మంత్రులం తా తమతమ నియోజకవర్గాల్లో ఆందోళనలకు దిగారు. హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద జరిగిన ధర్నాలో మంత్రులు, నగర ఎమ్మెల్యేలు, ఇతరప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టింది. సిరిసిల్లలో మంత్రి కెటిఆర్, సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు, నిర్మల్‌లో ఇంద్రకరణ్ రెడ్డి, వరంగల్‌లో ఎర్రబెల్లి దయాకర్రావు, నిజామబాద్‌లో ప్రశాంత్ రెడ్డి,ఖమ్మంలో మంత్రి పువ్వాడ, ఎంపి నామా నాగేశ్వరరావు తదితరులు ధర్నాల్లో పాల్గొన్నారు. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరికి నిరసనగా.. టీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగానే.. టీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఇందిరాపార్కు వద్ద చేరుకున్నారు. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ ధర్నాలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరా పార్క్ ధర్నాలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి,దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేయిస్తామన్నారు. తెలంగాణను అంటరాని రాష్ట్రంగా కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. విశాఖ ఉక్కుతో పాటు అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటోందని సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. వడ్లు కొనుగోలు చేయబోమని తేల్చిచెప్పిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేడ్చల్‌లో నిర్వహించిన ధర్నాలో మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వం సర్వ నాశనం అయిపోతుందన్నారు. బండి సంజయ్ ఓ మెంటల్ సంజయ్ అని… ఎప్పుడు ఏం మాట్లాడు తాడో ఆయనకే తెలియదని వ్యాఖ్యానించారు. సంజయ్ మగాడైతే కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు చేపించాలని మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించిన ధర్నాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు భారీ ఎత్తున రైతులతో ధర్నా నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల కు చెందిన రైతులు టీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదించారు. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వరి సాగు, ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి నిరసిస్తూ ధర్నా చేపట్టామ న్నారు. ధాన్యం కొనాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపిస్తుందని తెలిపారు. ఓ వైపు వరి ధాన్యం కొనమని కేంద్రం చెప్పుతుంటే, స్థానికి బీజేపీ నేతలు వరి సాగు చేయాలని రైతులను రెచ్చగొడుతున్నారన్నారు. బీజేపీ నేతలు కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద భారీ ఎత్తున రైతులతో ధర్నా నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన రైతులు టీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు. తెలంగాణ వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్లకార్డ్ ప్రదర్శిస్తూ ధర్నాలో పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు హోరెత్తించారు. తెలంగాణ రైతులపై కేంద్రం కక్ష్య కట్టిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. యాసంగి వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో సూర్యపేటలో టీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన రైతు ధర్నాలో మంత్రి పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతుల జేబులు నింపుతుంటే ప్రధాని మోదీ కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. రైతుల ధాన్యం కొనుగోలు చేస్తామని బీజేపీ పాలిత కేంద్రం ప్రకటించేంత వరకు పోరాటం కొసాగిస్తామన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులకు నిజంగా రైతుల పట్ల ప్రేమ ఉంటే డ్రామాలు ఆపి బియ్యం కొంటామని కేంద్రంతో ఒక్క ప్రకటన చేపిస్తే చాలు ఆందోళనలను విరమించుకుంటామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. యాసంగి వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలనే డిమాండ్ తో వరంగల్` ఖమ్మం హైవేపై రాయపర్తి మండల కేంద్రం వద్ద టీఆర్‌ఎస్ ధర్నాలో మంత్రి పాల్గొన్నారు. కేంద్రం యాసంగి వరి ధాన్యాన్ని కొనేవరకు ఆందోళనలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం కలెక్టరేట్ ముందు ధర్నా చౌక్‌లో టిఆర్‌ఎస్ నేతలు మహాధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్థానిక నేతలు పాల్గొన్నారు. ధర్నా చౌక్‌కు మంత్రి పువ్వాడ. ఎంపీ నామా, మాజీ ఎంపీ పొంగులేటి ఎడ్లబండిపై వచ్చారు. తెలంగాణ రైతులు పండిరచిన ధాన్యం కొనాలంటూ టీఆర్‌ఎస్ నాయకులు వరి నారుతో నినాదాలు చేశారు.