రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు..

మున్సిపల్ చైర్ పర్సన్ జింధం కళ.రాజన్నసిరిసిల్ల బ్యూరో. నవంబర్ 2. (జనం సాక్షి). రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని దాన్యం విక్రయించి లబ్ధి పొందాలని మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ అన్నారు. బుధవారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 10, 22వా. వార్డులలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర అందించేందుకే దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుందని అన్నారు. దళారుల చేతుల్లో మోసపోకుండా రైతులు దాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించి లబ్ధి పొందాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఎమ్మార్వో విజయ్ కుమార్, కౌన్సిలర్లు నాగరాజు గౌడ్, కల్లూరి లతమధు, రవి, వ్యవసాయ విస్తరణ అధికారి తిరుపతి మెప్మా అధికారులు రైతులు పాల్గొన్నారు.

తాజావార్తలు