రైతులు పంట నమోదు తప్పనిసరిగా చేసుకోవాలి:

:ఏఈఓ విజయ్ యాదవ్

హుస్నాబాద్ రూరల్ ఆగస్టు 30(జనంసాక్షి)రైతులు  తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలని ఏఈఓ విజయ్ యాదవ్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణం ఆరేపల్లి లో పంట నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నమోదు చేసుకున్న రైతులు పంటలను అమ్ముకునే సమయంలో ఇబ్బందులు ఉండవన్నారు.పంట నష్టపరిహారం, ఇన్సూరెన్స్ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందుతాయని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో 8వ వార్డ్ కౌన్సిలర్ మ్యాదరబోయిన వేణుయాదవ్,యాదవ సంఘము అధ్యక్షుడు గొర్ల కోమురయ్య,రైతు సంఘము నాయకులు కాశబోయిన మల్లేశం,గురాల సంజీవరెడ్డి,మిల్కురి రవీందర్,గొర్ల దేవేందర్,గంగుల రమేష్,మల్లేత్తుల విజేందర్ పాల్గొన్నారు.