రైతులు పోడు భూముల సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి.

ఎంపిపి బాలేశ్వర్ గుప్తా.
తాండూరు అక్టోబర్ 9(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని అడల్పుర్, అన్న సాగర్, బాణపూర్, గంగా సాగర్, కమల్పూర్, రాష్నం, రేండ్లగడ్డ తాండ, సంగాయిపల్లి రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపిపి బాలేశ్వర్ గుప్తా అన్నారు. శనివారం యాలాల మండల పరిషద్ కార్యాలయంలో పోడు భూముల సదస్సుకు ఎంపిపి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని ఉద్దేశ్యంతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆయా గ్రామాలలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శిలు బాధ్యత యుతంగా నిర్వహించా లని సూచించారు. 2005 డిసెంబర్ 13 వరకు కబ్జాలో ఉన్న రైతులను పరిగణలోకి తీసుకుంటా రని వివరించారు. ఈ నెల 15 నుండి గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపిపి రమేష్, ఎమ్మార్వో గోవిందమ్మ, ఎంపిడివో పుష్పలీల, జుంటిపల్లి అటవీ సెక్షన్ అధికారి ని స్వప్న, జిల్లా కో ఆప్షన్ సంఘం అధ్యక్షులు అక్బరుబాబా, సర్పంచ్ లు, అధికారులు పాల్గొన్నారు.