రైతులు వ్యవసాయ పనిముట్లు వినియోగించుకోవాలి
నవీపేట గ్రామీణం: వ్యవసాయ శాఖ ద్వారా అందిస్తున్న వ్యవసాయ పనిముట్లును రైతులు వినియోగించుకోవాలని జేడీఏ నరసింహ సూచించారు. నవీపేట మండలం పోతంగల్ గ్రామంలో ఈ రోజు రైతు చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీఏ మాట్లాడుతూ వ్యవసాయానికి సంబంధించిన యంత్ర పరికరాలను రూ. వెయ్యి నుంచి లక్షా 50 వేల వరకు రాయితీపై అందిస్తున్నట్లు నరసింహ తెలిపారు. యంత్ర పరికరాలు తమ గ్రామానికి పూర్తిగా అందడం లేదని రైతులు జేడీఏ దృష్టికి తీసుకొచ్చారు. పని ముట్లకోసం దరఖాస్తు చేసుకున్న రైతులందరీ అర్హతను బట్టి అందించాలని మండల వ్యవసాయాధికారి రవీందర్‌ను జేడీఏ ఆదేశించారు.