రైతుల ఆందోళనకు సమాతయ్తం
జైల్‌భరోతో సిద్దమవుతున్న రైతుల సంఘాలు
విజయవాడ,జూన్18(జనం సాక్షి): మహారాష్ట్రతో పాటు, ఇతర రాష్ట్రాల్లో ఇటీవల రైతులు ఆందోళనల నేపథ్యంలో ఎపిలూనూ అలాంటి ఆందోలనలను జరపాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ మేరకు ఆగస్ట్‌లో జైట్‌భరోతో శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందుకు భారీగా రైతులను సవిూకరించబోతున్నారు. దేశంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోందని, రైతాంగం అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటోందని ఎఐకెఎస్ అధ్యక్షులు అశోక్ ధావలే నేతత్వంలో జరిగిన సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. గిట్టుబాటు ధరలు లభించక రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తుండగా, ప్రభుత్వం ఆదుకునే చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. డాక్టర్ స్వామినాథన్ సిఫారసుల ప్రకారం అన్ని పంటలకు ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధరలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ అఖిల భారత కిసాన్‌సభ (ఎఐకెఎస్) పిలుపుమేరకు ఆగస్టు 9వ తేదీన జైల్‌భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు గట్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సన్నాహకంగా విజయవాడలో ఆంధప్రదేశ్ రైతు సంఘం, కౌలురైతు సంఘం అధ్వర్యాన ఆదివారం జరిగిన వర్క్‌షాప్‌లో ధావలే ప్రసంగించారు. జైల్‌భరో కార్యక్రమంపై విస్తృత ప్రచారం చేయాలనీ, ప్రతీ జిల్లాలోనూ కనీసం 50 వేల కరపత్రాలను పంచాలని, ఇతర ప్రచార రూపాలనూ వినియోగించాలని వర్కుషాపు నిర్ణయించింది. జైల్‌భరోకు ముందుగా జులైలో రాష్ట్రంలో రైతాంగం నుండి సంతకాలు సేకరించి, ఆ సంతకాలతో కూడిన వినతి పత్రాలను ఆగస్టు 9న ఆయా జిల్లా కలెక్టర్లకు అందజేయాలని అశోక్ ధావలే తెలిపారు. గ్రామాల నుండి రైతులను అధిక సంఖ్యలో జైల్‌భరో కార్యక్రమానికి సవిూకరించి విజయవంతం చేయాలని కోరారు. ఇటీవల మహారాష్ట్రంలో జరిగిన రైతాంగ ఉద్యమ అనుభవాలను ఆయన వివరించారు. పంటల కొనుగోలుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ప్రయివేట్ అప్పులతో సహా రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని కోరారు. కేరళ రాష్ట్రం మాదిరి రుణ విముక్తి చట్టాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని సూచించారు. ఇటీవల చేసిన సవరణలను రద్దు చేసి 2013 భూ సేకరణ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.