రైతుల ఆత్మహత్యలపై సర్కారు స్పందించాలి

3

– దేశంలో విదర్భ తరువాత తెలంగాణే

– ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఆవేదన

న్యూ ఢిల్లీ, ఆగస్టు 11(జనంసాక్షి):

రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే విధర్భా మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ రెండో స్థానంలో ఉందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకుల వ్యవహార శైలి వల్లే రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందని ఆరోపించిన ఆయన ఈ ఆత్మహత్యల నివారణకు టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఎలాంటి చర్యలకు ఉపక్రమించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఇకనైనా రైతు ఆత్మహత్యల నివారణకు పూర్థిస్థాయిలో చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.రైతుల ఆత్యహత్యలపై సర్కార్‌ స్పందిచాలన్నారు. ఇది ఇలా ఉండగా దేశంలో మరిన్ని చిన్న రాష్ట్రాలు రావాల్సిన ఆవశ్యకత ఉందని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్‌ ఆచార్య కోదండరాం అన్నారు. భవిష్యత్తులో ఏర్పడే చిన్న రాష్ట్రాలకు తెలంగాణ సమాజం మద్దతు ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. దిల్లీలో ఆల్‌ అస్సాం విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన చిన్న రాష్ట్రాల సదస్సులో కోదండరాం ప్రసంగించారు. ప్రభుత్వం ఆత్మహత్యల నివారణకు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు.   హైకోర్టు ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రపతికి ఉందని అన్నారు. ఇదే సమయంలో ఒకే రాష్ట్రంలో రెండు హైకోర్టులు ఉండొద్దన్న తీర్పు సమంజసం కాదని కోదండరాం అభిప్రాయపడ్డారు. వీలైనంత త్వరగా ఏపీ, తెలంగాణకు హైకోర్టును ఏర్పాటు చేయాలని కేంద్ర ¬ంశాఖ మంత్రిని ఆయన కోరారు. కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కేంద్ర కార్మిక శాఖ సహయ మంత్రి దత్తాత్రేయ, పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ప్రొ. కోదండరామ్‌ మంగళవారం కలిశారు. వారితోపాటు తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ నేతలు కూడా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణకు ప్రత్యేకంగా హైకోర్టును ఏర్పాటుచేయాలని వారు వినతిప్రతం సమర్పించారు.