రైతుల కోసం హైకోర్టుకు కోదండరామ్
– ఆత్మహత్యలపై ఇంప్లిన్ పిటీషన్ దాఖలు
హైదరాబాద్,అక్టోబర్13(జనంసాక్షి):
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరామ్ మంగళవారం హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. ఆత్మహత్యలను ప్రొత్సహించేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని, స్వామినాథన్ కమిటీ నివేదికను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక తరుపున కోదండరాం ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా… ఇదే అంశంపై గత వారం రోజుల క్రితమే వ్యవసాయ జనచైతన్య వేదిక కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ మొదటి అస్త్రం ప్రయోగించారు. కొద్ది రోజుల క్రితం హైకోర్టులో జనచైతన్య సమితి రైతుల ఆత్మహత్యలపై ఒక పిటిషన్ వేసింది.ఈ పిటిషన్ లో కోదండరామ్ ఇంప్లీడ్ అయ్యారు. రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ విద్యావంతుల వేదిక తరపున ఈ పిటిషన్ వేశారు. ప్రభుత్వ విదానాలు రైతుల ఆత్మహత్యలను ప్రోత్సహించే విదంగా ఉన్నాయని ఆయన అంటున్నారు. స్వామినాదన్ కమిటీ సిఫారస్ లను అమలు చేయవలసి ఉండగా వాటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. కోదండరామ్‌కు, కెసిఆర్ కు మధ్య అంతగా సంబంధాలు లేవని అంటున్న నేపధ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది.