రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.

ఆనందోత్సవాలు రైతులు..
ఉమ్మడి వరంగల్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ మాడుగుల రమేష్
ములుగు బ్యూరో,జూన్29(జనం సాక్షి):-
తొమ్మిదో విడత రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో రైతు బంధు తెరాస ప్రభుత్వం విడుదల చేసినట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీ డైరెక్టర్ నర్సాపూర్ సొసైటీ చైర్మన్ మాడుగుల రమేష్ తెలిపారు.బుధవారం విలేకరులతో మాట్లాడుతూ వానాకాలం సంబంధించిన రైతుబంధు నిధులు మంగళవారం నుండి రైతుల ఖాతాల్లో తెరాస ప్రభుత్వం జమ చేస్తుందన్నారు
తొలిరోజు ఐదు వందల ఎనభై ఆరు కోట్లు 19 లక్షల 98 వేల లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశారనీ అన్నారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తీసుకోవద్దని రైతుబంధు తోపాటు సంబంధిత బ్యాంకు లో రైతు రుణాలు పొంది వ్యవసాయ పనులు చేపట్టాలని రైతులకు సూచించారు.కేంద్ర ప్రభుత్వం ఆర్థికపరమైన అడ్డంకులు పెట్టిన రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశారని సంతోషం వ్యక్తం చేశారు.రైతు బిడ్డ రాష్ట్ర పాలకుడు కావడం తెలంగాణ రైతుల అదృష్టమని రైతు పక్షపాతిగా చరిత్రలో సీఎం కేసీఆర్ నిలిచారని తెలిపారు.గత పాలకులు రాష్ట్ర రైతాంగాన్ని దుబ్బ స్థితిలోకి నెట్టారని నెర బారిన భూముల్లో పసిడి పంటలు పచ్చని చెల్లతో చూడాలన్న సీఎం కేసీఆర్ కలలు సహకారం అవుతున్నాయని అందుకే రైతులకు అండగా నిలిచి పెట్టుబడి సాయం అందిస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ జాన పట్ల సంపత్,టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు సూత్రపు కర్ణాకర్,ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు వాసాల భద్రయ్య,వార్డ్ మెంబర్స్ గాజుల సాంబయ్య,రైతుబంధు మండల కమిటీ సభ్యులు అజ్మీర ప్రమీల, శీను నాయక్,రైతులు గాజుల రాజ నరసయ్య,మాడుగుల భాస్కర్,మల్యాల కొమురయ్య,మాడుగుల విష్ణు,అజ్మీర రాజేందర్,మాలోత్ రమేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.