రైతుల పట్టా భూముల్లో గుడిసెలు వేయడం అన్యాయం
విలేకరుల సమావేశంలో ముసుకులపల్లి రైతులు ఆవేదన
హనుమకొండ బ్యూరో చీఫ్ 14 సెప్టెంబర్ (జనం సాక్షి)
సుమారు 100 సంవత్సరాలకు పైగా బొల్లికుంట శివారు ముసుకులపల్లి గ్రామంలోని సర్వేనెంబర్ 484, 476,506 లలో నీ తమ రైతుల పట్టా భూముల్లో అక్రమంగా సిపిఐ ఆధ్వర్యంలో గుడిసెలు వేసిన వారిని తొలగించాలని తమకు న్యాయం చేయాలని ముసుకులపల్లి గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం వరంగల్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ముసుగుల మాధవరెడ్డి, రఘుపతి రెడ్డి, నరసింహారెడ్డి, తిరుపతిరెడ్డి, రణధీర్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, నరేంద్ర నాథ్ రెడ్డి, తుమ్మలక్ష్మీ, జన్నపరెడ్డి దేవిక, విలేకరుల సమావేశం నిర్వహించారు. సర్వేనెంబర్ 484, 476, 506లలోని తమ మొత్తం 22 ఎకరాల భూమి ఉండగా అందులో నాలుగు ఎకరాలలో సిపిఐ ఆధ్వర్యంలో గుడిసెలు వేశారన్నారు. ఈ విషయమై కలెక్టర్, సి పి, ఆర్ డి ఓ, ఎమ్మార్వోలకు ఫిర్యాదు చేయగా వారు గత నెల 30 తేదీన గుడిసెలు తొలగించారాని రైతులు తెలిపారు. అయినా మళ్లీ దౌర్జన్యంగా గుడిసెలు వేశారని ఈ విషయంలో మళ్లీ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయగా నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు వివరించారు. తమ సొంత పట్టా భూమిపై తమకు హైకోర్టు ఆర్డర్ ఉందని, రైతుబంధు కూడా వస్తుందని తెలిపారు. అలాగే ధరణి పోర్టర్ లో తమ పేర పట్టా ఉన్నట్లు వివరించారు. సుమారు 100 ఏళ్లకు పైగా ఈ భూముల్లో తాము వ్యవసాయం చేస్తూ జీవనోపాధిని పొందుతున్నామని రైతులు పేర్కొన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో అక్రమంగా వేసిన గుడిసెలు తొలగించి తమకు ప్రభుత్వం అధికారులు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
Attachments area