రైతుల సంక్షేమం కోసం కృషి చేయండి :మంత్రి తన్నీరు హరీష్ రావు.
దౌల్తాబాద్ సెప్టెంబర్ 21, జనం సాక్షి.
రైతుల సంక్షేమమే పరమావధిగా సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు.దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మీ, వైస్ చైర్మన్ శ్రీనివాస్, తమ పాలక వర్గం తో, ప్రజాప్రతినిధులతో కలిసి సిద్దిపేట లో మంత్రి తన్నీరు హరీశ్ రావు ని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.తమపై ఎంతో నమ్మకంతో అవకాశం కల్పించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈసందర్భంగా మంత్రి హరీష్ రావు వారికి శుభాకాంక్షలు తెలియజేసి, రైతుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఆదేశించారు. అనంతరం దుబ్బాక మాజీ ఎమ్మెల్యే సతీమణి సోలిపేట సుజాత, రాష్ట్ర నాయకులు సోలిపేట సతీష్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ కార్యక్రమం లో దౌల్తాబాద్ జడ్పీటీసీ రణం జ్యోతి, మండల పార్టీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్, జిల్లా కోఆప్షన్ సయ్యద్ రహీముద్దీన్, సీనియర్ నాయకులు ఇప్ప దయాకర్,మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
Attachments area
|