రైతుల సంక్షేమమే కెసిఆర్ లక్ష్యం
కేంద్రం తీరు వల్లనే అన్నదాతలకు కష్టాలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోటిరెడ్డి గెలుపు ఖాయం
విూడియాతో ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్లగొండ,డిసెంబర్1(ఆర్‌ఎన్‌ఎ): రైతుల సంక్షేమం విషయంలో దేశానికే మార్గదర్శి తెలంగాణ సీఎం కేసీఆర్ అంటూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రశంసలు కురిపించారు. ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులకు ప్రధాన కారణం బీజేపీయే అంటూ మండిపడ్డారు. నల్గొండలోని తన నివాసంలో ఎమ్మెల్యే భాస్కర్‌రావు, జెడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డితో కలిసి విూడియాతో మాట్లాడారు. రబీ ధాన్యం ఇంకా 50 శాతం ఎఫ్‌సీఐ గోదాముల్లో ఉంది, కేంద్ర ప్రభుత్వం రైల్వే వ్యాగన్లు ఏర్పాటు చేసి ఆ ధాన్యాన్ని వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు. ఇక, ధాన్యం సేకరణపై కేంద్రం పార్లమెంట్‌లో స్పష్టమైన ప్రకటన చేయాలని సూచించారు. మరోవైపు ఈ నెల 10వ తేదీన జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కోటిరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.. రాష్ట్రంలో గతంలో కంటే స్థానిక సంస్థల ప్రతినిధులందరికీ గౌరవ వేతనం భారీగా పెంచారని గుర్తు చేసిన ఆయన.. స్ధానిక సంస్థలను నిర్వీర్యం చేస్తుంది కేంద్ర ప్రభుత్వమే అని ఆరోపించారు. రైతులంతా కేసీఆర్ వెంట ఉన్నారనే బీజేపీ కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ చెప్పిన పసుపు బోర్డు ఏమైందని ప్రశ్నించారు. మిల్లర్లు పంపే బియ్యాన్ని ఎఫ్‌సీఐ త్వరగా దిగుమతి చేయట్లేదన్నారు. ధాన్యం సేకరణపై కేంద్రం పార్లమెంటులో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 10న జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి కోటిరెడ్డి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో గతంలో కంటే స్థానిక సంస్థల ప్రతినిధులందరికీ గౌరవ వేతనం భారీగా పెంచారని, కేంద్ర ప్రభుత్వమే స్ధానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు.