రైతుల సంక్షేమమే సిఎం కెసిఆర్ అక్ష్యం: ఎమ్మెల్యే
నిజామాబాద్,జనవరి18(జనంసాక్షి): రైతులకు అండగా నిలబడి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టెందుకు తెలంగాణ సిఎం కెసిఆర్ నడుం బిగించారని అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణెళిశ్ పేర్కొన్నారు. శ్రీరాం సాగర్ పునరుజ్జీవ పథకంతో రైతులకే కాకుండా ప్రజలకు కూడా తాఉనీటి సమస్య శాశ్వతంగా తొలగిపోగలదని అన్నారు. ఈ పథకం ఏడాదిలోనే పూర్తి చేయాలన్న సంకల్పమే గొప్పదని అన్నారు. మిషన్ భగీరథ కింద వాటర్ ట్యాంక్, పైపు లైన్ ఏర్పాట్లు చురకుగా సాగుతున్నాయని అన్నారు. ఈ ఏడాది చివరికల్లా ప్రతి ఇంటికి తాగునీరు అందించే దిశగా మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయన్నారు. ప్రాజెక్టులకు అడ్డుపడి కోర్టు కేసులతో రైతాంగం కడుపుకొట్టే పనికి పూనుకుంటున్న కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. సభ సక్సెస్‌తో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం పెల్లుబికిందని, కాంగ్రెస్ నేతల్లో ఆందోళన మొదలయ్యిందని అన్నారు. అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న పునరుజ్జీవ పథక ప్రారంభంతో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినట్లయ్యిందన్నారు. ఆయకట్టేతర భూములకు ఎస్సారెస్పీ నీటిని లిఫ్ట్‌ల ద్వారా అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు రూ. 50 కోట్లు చొప్పున ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. నీళ్లు, నిధులు,సంక్షేమ ఫలాల అమలులో ప్రపంచ దేశాలన్నీ తెలంగాణ వైపే చూస్తున్నాయని, కళ్లులేని కబోదిల్లాగా కాంగ్రెసోళ్లు వ్యవహరించడం వారి అనైతికం అని విమర్శించారు. 70ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేయని విధంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హావిూలన్నింటినీ కేవలం పాలనలో తూచా తప్పకుండా అ మలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు మాత్రమే దక్కిందన్నారు. ఇకపోతే సంక్షేమమే లక్ష్యంగా సిఎం కెసిఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నారని ఒంటిరి మహిళలకు ఆసరా భృతిని కల్పిస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఆడపిల్లల పెండ్లీలకు తమ ప్ర భుత్వం కల్యాణ లక్ష్మి, షాదీముబా రక్ పథకాలను అమలు చేస్తూ రూ. 51 వేలు నుంచి రూ. 75,116కు పెంచడం జరిగిందన్నారు. ఆడబిడ్డ సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఆడబిడ్డలకు అండగా నిలిచారన్నారు.