రైతుల సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్‌

– రైతులను సాధికారుల్ని చేయడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుంది
– బీజేపీ గెలుపుతోనే రైతులకు మేలు
– కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ
బెంగళూరు, మే2( జ‌నం సాక్షి) : కర్ణాటకలోని సిద్ధరామయ్య సర్కారు రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. రైతులను సాధికారుల్ని చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కర్ణాటకలోని కిసాన్‌ మోర్చా కార్యకర్తల సమావేశంలో మోదీ ప్రసంగించారు. యడ్యూరప్పను కర్షక నేతగా అభివర్ణించిన ప్రధాని మోదీ.. ఆయనను ముఖ్యమంత్రిని చేస్తే కర్ణాటక రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యంగా ఎన్డీయే సర్కారు చేపట్టిన వేర్వేరు చర్యలను మోదీ గుర్తు చేశారు.  ప్రకృతి, రైతులు, ప్రభుత్వం మధ్య సమన్వయం ఉండాలనీ… రైతన్నల ఆదాయం రెట్టింపు అయ్యేలా పనిచేయగల నాయకుడు ఎడ్యూరప్పను గెలిపించాలని ప్రధాని కోరారు. కర్ణాటకలోని నాలుగు లక్షల హెక్టార్ల భూమిని సూక్ష్మ సేద్యం కిందికి తీసుకొచ్చామనీ… సాగు చేసిన పంటలపై కనీస మద్దతు ధరను ఉత్పత్తి ధరపై 1.5 రెట్లు పెంచామన్నారు. రైతుల కోసం మరింత కష్టపడి పనిచేసేందుకు తాము సిద్ధమన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఉదాసీనత కారణంగా రాష్ట్రంలోని రైతులు ‘ఫసల్‌ బీమా యోజన’ ఫలాలు అందుకోలేక పోయారన్నారు. కర్ణాటకలో రైతుల కోసం చిత్తశుద్ధితో పనిచేసే ప్రభుత్వం అవసరం ప్రధాని పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ కూడా
ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టోలో రైతులకు పలు హావిూలు కురిపించింది. మళ్లీ అధికారం కట్టబెడితే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామనీ.. దెబ్బతిన్న పంటలకు పరిహారం, నిరంతర విద్యుత్‌ సరఫరా తదితర హావిూలను ప్రకటించింది.