రైతుల సమస్యలు తీర్చడానికే రైతు చైతన్యయాత్ర – నిజామాబాద్ జిల్లా కలెక్టర్ డి. వరప్రసాద్
రైతుల కోసమే నిర్ధేశించిన రైతు చైతన్య యాత్రలలో పెద్ద సంఖ్యలో హాజరై అధికారులు చెప్పే విషయాలను అవగాహన చేసుకోవాలని, తద్వారా వ్యవసాయ పరంగా మార్పులకు శ్రీకారం చుట్టాలని జిల్లా కలెక్టర్ డి. వరప్రసాద్ తెలిపారు. గురువారం ధర్ పల్లి మండలం అన్సాన్‌పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు చైతన్య యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. రైతులు మాట్లాడానికి ఎక్కువ అవకాశం ఇచ్చి సమస్యలను అడిగి తెలు సుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయపరంగా విప్లవాత్మక మార్పులకు అధిక దిగుబడులకు, ఆర్థిక ఎదుగుదలకు జిల్లా యం త్రాంగానికి సంబంధించిన పలు అధికారులు ఈ కార్యక్రమాల్లో రైతులను చైతన్యపర్చడానికి వస్తా రని, తద్వారా రైతులు అవగాహన ఏర్పరుచుకొని లబ్దిపొందవలసిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలను ఉద్దేశించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాలకు రైతులంతా విధిగా హాజరై వారికి గల అనుమానాలను, సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. ముఖ్యంగా పంటల సాగు, భూసార పరీక్షలు, పంటల మార్పిడి, ఎరువుల వినియోగం, కంపోస్టు ఎరువుల తయారీ, ఉప యోగం, పంట రుణాలు తదితర అంశాలపై రైతులు అధికారులను అడిగి తెలుసుకోవలసిన అవసరముందన్నారు. అప్పుడే ఈకార్యక్రమాలకు సార్థకత ఏర్పడుతుందన్నారు. అన్ని సమస్యలకు పరిష్కారం చూపకపోయినప్పటికీ వాటిపై ఆలోచి ంచడానికి, మార్గాలను అన్వేషించడానికి, కారణా లను తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడతుంద న్నారు. ముఖ్యంగా విద్యుత్, ఎరువులు, విత్తనాలు, సబ్సిడీలు, రుణాలు తదితర అం శాలకు వెంటనే పరిష్కారం చూపిచడానికి వీలవ ుతుందన్నారు. 90శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడినందున రైతుల కార్యక్రమాలకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అధికా ప్రాధాన్యత ఇస్తున్న విష యాన్ని గుర్తుంచుకోవాలన్నారు.కొద్ది రోజుల్లోనే వర్షాలు పడే సూచనలు ఉన్నందున ఖరీఫ్ సాగుకు ముందస్తుగా ఎరువులను సేకరిం చుకొని సిద్ధంగా ఉండాలని సూచించారు. రైతుల సేవలకై ఏర్పడ్డ సహకార సంఘాలకు అధిక ప్రాధా న్యతనిస్తూ వాటి ద్వారానే ధాన్యం కొను గోలు కేంద్రాల ఏర్పాటుతో పాటు ఎరువులు, విత్త నాలు కూడా వాటి ద్వారానే సరఫరా చేస్తున్నా మన్నారు. రైతుల సమస్యలను పరిశీలిస్తే గ్రామం లో రెవెన్యూ సదస్సును సరిగా ఉపయోగిం చుకున్నట్లు కనిపించడంలేదని, భూములు సమస్యలకు సంబంధించి వెంటనే రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు అంద జేసి సమస్యలు పరిష్కరించుకోవాలన్నార. ఉపాధి హామీ పథకంలో చెరువులలో మట్టిని తీసి చిన్న, సన్నకారు రైతుల భూములకు తరలించుకో వాలన్నారు. అన్ని గ్రూపులకు , కూలీలందరికి పని కల్పించాలని ఆదేశించారు. ప్రతి కుటుం బానికి రేషన్ కార్డు అందించాలని లక్ష్యంగా పెట్టు కున్నామని, కార్డులలో మార్పులకు,చేర్పులకు జిల్లా యంత్రాంగానికే ప్రభుత్వం అధికారాలు ఇచ్చిందని, వీటిని త్వరలోనే సరి చేస్తామన్నారు. తద్వారా పెన్షన్లు, ఇండ్ల మంజూరీకి, ఆరోగ్యశ్రీ కివెసులుబాటు ఏర్పడుతుందన్నారు. గ్రామంలో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు జిల్లా పరి షత్ నుంచి నిధులు మంజూరుకు చర్యలు తీసు కుంటామన్నారు. గ్రామంలో విద్యుత్ సరఫరా మెరుగుకు ప్రతిపాదనలు పంపించల్సిందిగా ట్రాన్స్‌కో ఎస్‌ఇని ఫోను ద్వారా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ హర్షవర్ధన్, ఆర్డీవో హన్మంత్ రెడ్డి, జెడీఏ వేణుగోపాల నాయుడు, ఏడీఏ గంగారాం, పశు సంవర్థక శాఖ ఇన్‌చార్జి జెడి శంకర్ రెడ్డి, ఉద్యానవనశాఖ ఏడీ శ్రీనివాసులు, ప్రత్యేకాధికారి సురేందర్ రెడ్డి, ఎంపీడీవో గణపతి, తహసీల్దార్ వీణ తదితరులు పాల్గొన్నారు.