రైతు కుటుంబానికి ఆర్థిక సాయం

తాంసీ: గత రెండు రోజుల క్రితం తాంసీ మండలం బెలసరి రాంపూర్‌కు చెందిన రైతు పి.ప్రకాశ్‌ ఇళ్లు విద్యుదాఘాతంతో కాలి బూడిదయ్యింది. ఆదివారం ఇండియా రెడ్‌క్రాన్‌ సొసైటీ వారు రూ.10 వేల నగదుతో పాటు రూ. 20 వేలు విలువైన వస్తువులకు బాధిత రైతు కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్‌క్రాన్‌ సొసైటీ కౌన్సిల్‌ సభ్యుడు విజయ్‌కుమార్‌ డోక్వాల్‌, స్టెవ్‌ సీఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.