రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయాలి. నూకల సందీప్ రెడ్డి.
నేరేడుచర్ల( జనంసాక్షి)న్యూస్.రైతాంగానికి వానకాలం సీజన్ వచ్చినప్పటికీ ఇంతవరకు రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమకాలేదని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల సందీప్ రెడ్డి అన్నారు.శనివారం నాడు ఆయన మాట్లాడుతూ, 2018 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం లక్ష రూపాయల రుణమాఫీ అమలు కాకపోవడంతో వడ్డీల మీద వడ్డీలు పెరిగి రైతులు ఆర్థిక పరిస్థితి చితికి పోయిందనీ, రాష్ట్రానికి వెన్నెముక అయిన రైతులకు రుణమాఫీ చేసే విషయంలో కానీ రైతు బంధు నిధులు విడుదల చేసే విషయంలో గానీ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని, పంటకాలంలో పెట్టుబడి కోసం రైతాంగం ఇక్కడ అక్కడ, అప్పులు చేయాల్సిన అగత్యం ఉండకూడదని రైతు బంధు పథకం ప్రవేశపెట్టామని చెప్పుకునే ప్రభుత్వం సమయానికి డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అనేక ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే పొలం పనులు ప్రారంభించారని ఇప్పటి వరకు కూడా రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కాలేదన్నారు.57 సంవత్సరాలు నిండిన వృద్యాప పెన్షన్లు దరఖాస్తుదారులందరికీ వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని,రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల కాలం నుండి 57 సంవత్సరాలు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని నేటి వరకు ఇవ్వలేదన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ బచ్చల కూరి ప్రకాష్, రణపంగ నాగయ్య,నూకల సుగుణ,జిల్లా నాయకులు తాళ్ళ రామకృష్ణ రెడ్డి,ఇనుపాల పిచ్చిరెడ్డి, జంగిలి వెంకటేశ్వర్లు గజ్జల కోటేశ్వర రావు,తాళ్ళ చిన రామకృష్ణారెడ్డి,వడ్డగాని లింగయ్య,బారి సోమయ్య, సతీష్ జానీ తదితరులు ఉన్నారు.