రైతు భీమా సమాచారంలో ఆలస్యం చేయవద్దు ఏఈఓ ప్రవీణ్ కుమార్

చందంపేట (జనం సాక్షి) జూన్ 25

రైతూ బీమా పథకం లో నమోదు చేసుకున్న రైతు ఏ కారణం చేతనైనా చనిపోతే ఆ సమాచారం వ్యవసాయ శాఖ అధికారులకు వెంటనే అదే రోజు లేదా మూడు రోజుల లోపు సమాచారం తప్పకుండా ఇవ్వగలరు

కేవలం సమాచారం మాత్రం ఇస్తే చాలు డాక్యుమెంట్స్ తర్వాత ఇవ్వవచ్చు
అగ్రికల్చర్ వారికి ఇవ్వవలసిన ప్రాథమిక సమాచారం
రైతు ఆధార్ నెంబరు లేదా రైతు పట్టాదారు పాసుపుస్తకం నెంబరు
ఎక్కడ చనిపోయారు
ఎలా చనిపోయారు
ఎప్పుడు చనిపోయారు
పైన చెప్పిన సమాచారం ఇవ్వాలి సమాచారం ఇచ్చే వ్యక్తి వివరాలు చనిపోయిన వ్యక్తికి ఏమవుతారో కావాలి కొత్తగా పాస్ బుక్ లో వచ్చిన వారు రైతు బంధు అప్లై చేసుకోగలరు
 ఏఈఓ పోలేపల్లి క్లస్టర్ బి ప్రవీణ్ కుమార్ తెలిపారు