రైతు మెడపై అప్పుల క(మి)త్తి
హుజురాబాద్, జనంసాక్షి: జిల్లాలో 31 వాణిజ్య బ్యాంకులు రబీ, ఖరీఫ్ సీజన్లకు కలిపి 2012-13ఆర్థిక సంవత్సరంలో సుమారు నాలుగు లక్షల మంది రుణాలు ఇచ్చాయి. మొత్తంగా 1600 కోట్ల రూపాయలు రుణాల రూపేణా ఇవ్వగా, రబీలో రూ. 500, ఖరీఫ్‌లో రూ. 1100కోట్లను రైతులు వ్యవసాయ అవసరాలు కోసం వివిధ బ్యాంకుల నుంచి అప్పులుగా తీసుకున్నారు. కరువు కాటకాల నేపథ్యంలో సరైన పంటల దిగుబడి రాలేదు. దీంతో ప్రభుత్వం వడ్డీ మాఫీ పథకానికి తెరలేపింది. నిర్ణీత గడువులోగా తీసుకున్న రుణం చెల్లించినట్లుయితే వడ్డీ మొత్తాన్ని తామే చెల్లిస్తామని ప్రకటించింది. దీనికి రబీ సీజన్‌కైతే జూన్ 30ది, ఖరీఫ్‌కైతే మార్చి 31 తేదిన గడువుగా విధించారు. దీంతో ఎంతో కొంత మేలు జరుగుతుందన్న ఆశతో రైతులు అప్పోసప్పో చేసి అప్పులు చెల్లించారు. జిల్లాలో 70 శాతం మేరకు అంటే సుమారు 2.షషలక్షల మంది రైతులు తీసుకున్న రుణాలను కట్టేశారు. ఒక కో ఆపరేటివ్ బ్యాంక్‌లు మాత్రం మిత్తి లేకుండా కేవలం అసలునే తీసుకున్నాయి. మిగతా బ్యాంకులు మిత్తితో సహా చెల్లించండి, ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల కాగానే మీ అకౌంట్లలో జమ చేస్తామంటూ మిత్తి, అసలు కలిపి వసూలు చేశాయి.
గడువు ముగిసినా ధ్యాసే లేదు
మార్చి 31తో ఈ ఆర్థిక సంవత్సరం ముగిపోయింది. వడ్డీ మాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాలేదు. ఇప్పటికే అర్హుల జాబితాను రూపొందించి ప్రభుత్వానికి వడ్డీ రాయితీ సొమ్మును విడుదల చేసేందుకు పంపించాల్సి ఉంది. అయితే కనీసం అర్హులైన రైతుల జాబితాను కూడా ఆయా బ్యాంకులు సిద్ధం చేయనట్లు సమాచారం. బ్యాంర్లు మాత్రం మాకు మదర్ బ్యాంక్ నుంచి ఎలాంటి ఆదేశాలురాలేదని చెప్తున్నారు. ఈ పరిణామాలను చూస్తుంటే వడ్డీ మాఫీ పథకంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం వడ్డీ మాఫీ రాయితీ సొమ్మును ఇస్తుందా? లేదా అనేది సందేహాస్పందంగా మారింది. రైతులపై రూ. 124 కోట్ల వడ్డీ భారం ప్రభుత్వం వడ్డీ మాఫీ పథకానికి మంగళం పాడితే జిల్లా రైతాంగం రూ.124కోట్ల మిత్తి మోయాల్సి ఉంటుంది. రబీలో రూ.500కోట్లు, ఖరీఫ్‌లోరూ.1100 కోట్ల రుణాలను తీసుకోగా అందులో 70 శాతం వరకు రైతులు వడ్డీ మాఫీ ఆశతో తిరిగి చెల్లించారు. రబీలో రూ.54కోట్లు, ఖరీఫ్‌లో రూ.70 కోట్లు ర్షకులు మిత్తి రూపేణా బ్యాంకులో కట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా కలుగజేసుకొని వడ్డీ మాఫీ రాయితీని విడుదల చేస్తే అన్నదాతలపై కొంతలో కొంత భారం తగ్గినట్లవుతుందని పలువురు పేర్కొంటున్నారు. రైతుల రుణాలకు సంబంధించి ఇప్పటి నుంచి స్టేట్ లెవల్ బ్యాంర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సరికొత్త విధానాన్ని రూపొందించినట్లు తెలుస్తుంది. గతంలో రబీ రుణాలకు జూన్ 30లోపు ఖరీఫ్ రుణాలను మార్చి 31లోపు చెల్లించాల్సి ఉండేది. ప్రస్తుతం రైతు రుణం పొందిన తేది నుంచి ఏడాది లోపు ఎప్పుడైనా అప్పులు చెల్లించే విధంగా కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు.