రైతు రుణ మాఫీ చేసిన కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపిన సింగల్ విండో చైర్మన్
జనంసాక్షి, కమాన్ పూర్ : కమాన్ పూర్ వ్యవసాయ సహకార పరపతి సంఘం లోని రైతులకు రుణమాఫీ చేయడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సింగల్ విండో చైర్మన్ ఇనగంటి భాస్కరరావు కృతజ్ఞతలు తెలిపారు. 11-12-2018 లోపు కమాన్ పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నందు లక్ష రూపాయల లోపు పంట ఋణం తీసుకున్న 254 మంది రైతులకు మొత్తం రూ: 1.26.01.895 /- లు రైతుల యొక్క ఋణ ఖాతాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జమచేయడం జరిగింది అని భాస్కర్ రావు పేర్కొన్నారు.
కేసీఆర్ రైతు పక్షపాతి అని రైతు ఋణమాఫీ ద్వారా మరొక మారు నిరూపించుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఋణ మాఫీ చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి, రాష్ట్ర మంత్రి వర్యులు కేటీఆర్ కి, కొప్పుల ఈశ్వర్ కి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి, పెద్దపల్లి జెడ్పీ చైర్ పర్సన్ పుట్ట మధూకర్ కి, ప్రత్యేకంగా నా తరపున రైతు సోదరుల తరపున, సింగిల్ విండో పాలకవర్గం కమాన్ పూర్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు భాస్కర్ తెలిపారు.