రైతు లకు ఆత్మహత్యలే శరణ్యమా

 రెవెన్యూశాఖ తీరు మారదా?

 ఖమ్మం రూరల్అక్టోబర్ 23 జనంసాక్షి:రైతుల పరిస్థితి పెనం మీదనుండి పొయ్యిలో పడ్డట్టు ఉన్నది పాత పట్టాదారు పాసుపుస్తకం ఈ పహాని రావటంలేదు కొత్త పాసు పుస్తకం ఇవ్వటంలేదు ఈ పహాని రాదు ఒకవేళ పాసుపుస్తకం ఇచ్చిన రైతు ఫోటో మారి ఉంటది లేదా భూమి మొత్తం ఉండదు ఇది పాసుపుస్తకం పరిస్థితి పాసుపుస్తకం రాని రైతులు ఆందోళన చెందుతున్నారు ఆపద్ధర్మ ప్రభుత్వములో పాసు పుస్తకాలు వస్తాయా. రావా రెవిన్యూ అధికారులేమో ఎలక్షన్ డ్యూటీ అని సాకులు చెపుతున్నారు రైతు ల పరిస్థితి విషమంగా ఉంది బ్యాంకు అధికారులు కొత్త పాసుపుస్తకం ఉంటేనే బాకీల రెన్యువలు చేయడంలేదు రెవెన్యూ సిబ్బంది పాత ఆన్ లైన్ అయి ఈ పహాని వచ్చినవి భూములను రికార్డు నుండి తొలగించారు కొత్తగా పాసుపుస్తకం. వచ్చిన వారికి మాత్రమే ఆన్ లైన్ లో పహాని వస్తున్నది దాని వలన పాసుపుస్తకం రాని రైతుల కు బ్యాంక్ బకాయిలు వడ్డీ మీదపడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు వ్యవసాయ పెట్టుబడికి బ్యాంక్ లలో అదనంగా లోను తీసుకుందాం అనుకునే రైతులకు అసలు లోను లేదు ఉన్న లోనుకు వడ్డీమాఫీ రాని పరిస్థితి నెలకొంది ఇప్పడు రైతుల గోస భగవంతునికి ఎరుక రెవెన్యూశాఖ బాధ్యత తోప్రవర్ర్తిస్తే రైతులకు ఇన్నికష్టాలు వచ్చేవికావు ఈ శాఖ కే ప్రభుత్వము అదనంగా ఇంక్రిమెంట్ ఇచ్చినది కనీసం అందుకైనా విశ్వాసంగా క్రమశిక్షణతో పని చేయవలసిన రెవిన్యూ శాఖ బాధ్యత లేకుండా ఫ్రీగా చేయవలసిన సాధబైనామా ను డబ్బుల బైనామా గా మార్చిన ఘనత రెవిన్యూశాఖదే డబ్బులు వేలకు వేలు లంచాలు తీసుకుని పనిచేయని మోసపురితమైనట్ శాకేదైన ఉన్నదంటే అది రెవెన్యూశాఖ అని రైతులు ఆగ్రహం చెందుతున్నారు   రెవెన్యూశాఖ పనితీరువలన రైతుల భవిషత్తు ప్రశ్నార్ధకంగా మారినది రైతు పేరు మీద భూమి లేకపోవటం వలన రైతుబందుద్వారా వచ్చే ప్రభుత్వంఎకరానికి ఇచ్చే నాలుగు వేల రూపాయలు రావు .రైతులకుప్రభుత్వము కల్పించిన రైతుబిమావర్తించదు అసలు విషయం ఏమిటంటే రైతు దున్నకునే స్వంత భూమి అయినా ఆతనికి వుంటాదా లేక ఎవరికైనా పట్టచేస్తారా అన్నదే భయము ఎందుకంటే తాతల నుంచి వరసత్వానిగా వస్తున్న భూమినే మార్చిన ఘనులు మన రెవెన్యూ అధికారులు అని రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ శాఖ నుండి రైతులను ఆదుకునేందుకు ఎవరైనా మహానుభావులు ఉన్నారా అని రైతులు ఎదురు చూస్తున్నారు  , ఉన్నత అధికారులైన తగుచర్యలు తీసుకొని రైతుల కన్నీరు తుడుస్తారా అని ఆశపడుతున్నారు