రైతు సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి:
తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కూన్ రెడ్డి నాగిరెడ్డి
తిరుమలగిరి (సాగర్), సెప్టెంబర్ 16 (జనంసాక్షి): ఈనెల 22న మిర్యాలగూడలో జరిగే తెలంగాణ రైతు సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కూన్ రెడ్డి నాగిరెడ్డి కోరారు.
శుక్రవారం మండల కేంద్రంలో శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో తెలంగాణ రైతు సంఘం రెండవ మండల మహాసభలు నిర్వహించారు .
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కున్ రెడ్డి నాగిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి, స్వామినాథన్ కమిషన్ ప్రకారం మద్దతు ధర ప్రకటించకుండా, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోడీ ఆదాయం రెట్టింపు చేయకపోగా ఖర్చులను రెట్టింపు చేశాడని అన్నారు. విత్తనాలు, ఎరువులు పురుగు మందుల ధరలు మూడింతలు పెంచి రైతుల నడ్డి విడుస్తున్నారని, పెట్రోల్, డీజిల్,గ్యాస్ ధరలు పెంచి ప్రజలను పిప్పి చేస్తున్నాడని, దేశంలో మోడీ పాలన దుర్మార్గంగా ఉందని అన్నారు. రైతులంతా అందరూ ఏకమై మోడీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలన్నారు. అనంతరం ఈ నెల 22న నల్గొండలో జరిగే తెలంగాణ రైతు సంఘం జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.
అనంతరం నూతన మండల అధ్యక్ష, కార్యదర్శులుగా నరసింహ నాయక్,రమేష్ నాయక్ లను ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులుగా పాశం లక్ష్మీకాంత్ రెడ్డి,కిచ్య నాయక్, హెమ్ల నాయక్,రమణ,గొప్ప నాయక్, భోజ్యా నాయక్,మత్రు నాయక్,బద్య నాయక్ ఎన్నుకున్నారు .
ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన జిల్లా కార్యదర్శి కొర్ర శంకర్ నాయక్,వ్య కా స రాష్ట్ర కమిటీ సభ్యులు జటావత్ రవి నాయక్, తెలంగాణ గిరిజన సంఘం మండల కార్యదర్శి కోర్ర రాజు నాయక్, మహిళా సంఘం మండల కార్యదర్శి విజయ, నాగర్జున సాగర్ సోషల్ మీడియా కన్వీనర్ జటావత్ రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.