రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులుగా బంటు వెంకటేశ్వర్లు
మిర్యాలగూడ జనం సాక్షి. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర మహాసభలు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండల కేంద్రంలో జూలైఒకటవ తేదీ నుండి మూడో తేదీ వరకు మహాసభలు జరిగిన మహాసభలలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రెండవ మహాసభలో రాష్ట్ర సమితి సభ్యులుగా బంటు వెంకటేశ్వర్లు లను ఏకగ్రీవంగా ఎన్నకున్నారు. ఈ సందర్బంగా . బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంఘం రాష్ట్ర సమితి సభ్యునిగా తెలంగాణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల అనుచితమైనటువంటి ధోరణి వ్యవహరిస్తున్నదని. ధాన్యం కొనుగోలు విషయంలో ఒకరిపై ఒకరు నిందలు మోపుతూ రైతులను అయోమయానికి గురి చేసినారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన వైఖరితో రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చూడాలని వారన్నారు వ్యవసాయానికి ఒక ఎకరానికి 35 నుండి 40 వేల రూపాయలు పెట్టుబడి వస్తా ఉన్నది కేంద్ర. ప్రభుత్వం ప్రకటించినటువంటి వంద రూపాయల సబ్సిడీ ప్రకటించటం వలన రైతులకు ఒరిగినది ఏమీ లేదు. రైతులకు న్యాయం చేయాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి స్వామినాథన్ కమిషన్ను సిఫారసును అమలు చేస్తే తప్ప రైతులకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. లక్ష రూపాయల రుణమాఫీ విషయంలో ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేక పోతా ఉన్నది. వెంటనే లక్ష రూపాయల రుణమాఫీ చేసి రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలని వారన్నారు రైతులకు గిట్టుబాటు ధర వచ్చేంతవరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులను కలుపుకొని ప్రజా పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు.