రైతు సకాలంలో ఋణాలు చెల్లించి అధిక లాభం పొందాలి.

నెరడిగొండసెప్టెంబర్22(జనంసాక్షి):
వ్యవసాయ రైతులకు మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడంలో తెలంగాణ దక్కన్ గ్రామీణ బ్యాంక్ ముందంజలో ఉందని గ్రామీణ బ్యాంకు మేనేజర్ అన్నారు.బుధవారం రోజున మండలంలోని కుమారి గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో మండల తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సిబ్బంది రైతు రుణాలపై అవగాహన కార్యక్రమాన్నినిర్వహించారు.ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేష్ హాజరైనారు.ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు మాట్లాడుతూ రైతు ప్రభుత్వ బ్యాంకు నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుని వ్యవసాయ రైతులు మహిళా సంఘాలు చిరువ్యాపారం చేపట్టి సకాలంలో ఋణాలు చెల్లించి ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. రైతులు యువకులు రైతు భీమా ప్రమాదభిమా చేసుకుంటే కుటుంబ సభ్యులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజు యాదవ్ పీఏసీఎస్ చైర్మన్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్  రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Attachments area