రైతు సమస్యలపై నేడు ధర్నా
కడప, జూలై 15 (ఎపిఇఎంఎస్):
పులివెందుల నియోజకవర్గంలోని రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పులివెందుల ఎమ్మెల్యే విజయమ్మ సోమవారం ఎమ్మార్వో కార్యాలయం వద్ద మహాధర్నాను నిర్వహించనున్నారు. పులివెందుల నియోజకవర్గంలో పంట భూములకు పీబీసీ నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. చీనీ రైతులను ఆదుకోవాలన్నారు. నియోజకవర్గంలో నెలకొన్న నీటి ఎద్దడిని వెంటనే పరిష్క రించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ నిలిచిపోయాయని, వాటినిఅమలు చేయాలన్నారు. ఈ స మస్యల పరిష్కారం కోసం విజయమ్మ మహాధర్నాను నిర్వహించనున్నట్టు ఆ పార్టీ నాయకులు తెలిపారు.