రైలునుంచి పడి యువకునికి తీవ్ర గాయాలు

 

జమ్మికుంట గ్రామీణం జమ్మికుంట మండలం విలా సాగర్‌ గ్రామ సమీపంలో రైలునుంచి పడి 20ఏళ్ల గుర్తు తెలియని యువకునికి తీవ్ర గాయాలయ్యాయి తలకు తీవ్ర గాయాలుకాగా జమ్మికుంటలోని ప్రభుత్వ అసుపత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించారు. పరిస్థితి అందోళనకరంగా ఉండటంతో వైద్యం కోసం స్థానిక 108 సిబ్బంది వరంగల్‌ ఎంజీఎం అస్పత్రికి తరలించారు.