న్యూఢల్లీి,డిసెంబర్10 జనంసాక్షి: విశాఖ రైల్వే జోన్‌పై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కప్పదాటుగా సమాధానం ఇచ్చారు. అలాగే సంబంధం లేని విధంగా గందరగోళంగా సమాధానమిచ్చారు. రైల్వేజోన్‌పై టీడీపీ ఎంపీ కనకమేడల లేవనెత్తిన సందేహాలపై స్పష్టత ఇవ్వకుండా మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఒకింత గందరగోళం సృష్టించారు. రైల్వేజోన్‌పై స్పష్టత కోరితే విభజన హావిూలన్నింటినీ నెరవేర్చుతామని మాత్రమే సమాధానం ఇచ్చారు. విశాఖ రైల్వేజోన్‌పై ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారో కూడా చెప్పలేకపోయారు. వైజాగ్ రైల్వేజోన్‌పై లోక్‌సభలో ఇటీవల ఇచ్చిన సమాధానంపై స్పష్టత కావాలని ఎంపీ కనకమేడల కోరారు. విశాఖ రైల్వే జోన్ పేరెత్తకుండా విభజన హావిూల అమలుకు కట్టుబడి ఉన్నామని మాత్రమే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.