రైల్వే జీఎంను కలిసిన తెదేపా ఎంపీలు

సికింద్రాబాద్‌: తెదేపా పార్లమెంట్‌ సభ్యులు నామా నాగేశ్వరరావు, సీఎం రమేష్‌లు శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ దేవీప్రసాద్‌ పాండేతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వివిధ రైల్వే మార్గాల నిర్మాణంతో జాప్యం, ప్రయాణికుల సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు, ఖమ్మం, హైదరాబాద్‌, కర్నూలుల నుంచి వివిధ ప్రదేశాల నుంచి కొత్తరైల్వే ఏర్పాట్లు తదితర అంశాలను చర్చించారు. ప్రధాన స్టేషన్‌లలో కూడా మంచినీటి కొరత ఎదురవుతుందని వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఎంపీల సూచనలు పరిశీలించి చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఎంపీల సూచనలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని జీఎం వారికి హామీ ఇచ్చారు.