రైల్వే వంతెన పనుల పరిశీలన
కాగజ్‌నగర్ : పట్టణంలోని రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం పనులను సిర్పూర్ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. పనులను సత్వరమే పూర్తి చేయాల్సిందిగా ఎమ్మెల్యే అధికారులను అదేశించారు. రైల్వే పై వంతెన పనులను పరిశీలించిన వారిలో మున్సిపల్ కమిషనర్ రాజు, ఇంజినీర్ సలీం, ఆర్‌డబ్య్లుఎస్ డీఈ నర్శింహ, డిస్కం డీఈ దర్శస్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.