రైల్‌ దుర్ఘటనపై నిష్పాక్షికంగా విచారణ చేపట్టాలి

నెల్లూరు, ఆగస్టు 2 : తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ దుర్ఘటనపై నిష్పాక్షికంగా విచారణ జరపాలి ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం ఏర్పాటు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సంఘటనపై భిన్న కథనాలు వినవస్తున్నాయని, రైలులో పేలుడు పదార్థాలు తీసుకువెళ్లడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని సర్వత్రా ప్రచారం జరగుతున్నందునా అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎస్‌-11 బోగి మధ్యలోంచి మంటలు చెలరేడం వల్ల ఇది షార్ట్‌ సర్క్యూట్‌ కాదన్న అనుమానం బలంగా ఉందని, ఇదికాక 50, 54 బెర్త్‌లు కింద రెండు పెద్ద రంధ్రం ఏర్పడడం.. బోగికి నిప్పుంటుకున్నట్టు తెలుస్తుందన్నారు. ఫోరెన్సిక్‌ నిపుణులు, పోలీసులు ఈ సంఘటనలో మరింత బాధ్యతగా పనిచేసి వాస్తవాలను వెలికితీయాల్సి ఉందన్నారు. గతంలో గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో ఇదే విధమైన సంఘటన చోటుచేసుకోగా ఇప్పటి వరకు దానిపై నివేదిక ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ఈ సంఘటన మీద పార్లమెంట్‌లో ప్రస్తావించనున్నట్టు తెలిపారు.

తాజావార్తలు