రోడ్డుపై చితగ్గొట్టి చంపేశారు: నిందితుల్లో పోలీసు కొడుకు

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో నడిరోడ్డుపై అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడిని ఆరుగురు యువకులు అత్యంత దారుణంగా, నిర్దయగా కొట్టారు. ఆ సంఘటన కెమెరాకు చిక్కింది. వారి చేతిలో దెబ్బలు తిన్న 22 ఏళ్ల యువకుడు మంగళవారం సాయంత్రం మరణించాడు. దాడి జరిగిన కొన్ని గంటల్లో అతన్ని మృత్యువు కబళించింది దాడి చేసిన వారిలో ఓ పోలీసు కుమారుడు కూడా ఉన్నాడు. అమోల్ ఘుగే అనే అతనితో పాటు మరో ఐదుగురిపై పోలీసులు హత్యనేరం కింద కేసు నమోదు చేశారు. ఈ దాడికి గల కారణం తెలియరాలేదు. అఫ్జల్ తన మిత్రుడితో పాటు బైక్‌పై వెళ్తుండగా ఆరుగురు యువకులు వచ్చి అడ్డగించి, వాదనకు దిగారు. రోడ్డుపై చితగ్గొట్టి చంపేశారు: నిందితుల్లో పోలీసు కొడుకు అమోల్ ఘుగే అఫ్జల్‌ను బైక్ మీది నుంచి లాగి కొట్టడం ప్రారంభించాడు. ఈ సమయంలో అఫ్జల్ మిత్రుడు తప్పించుకుని పారిపోయాడు. బైక్‌పై అతను పారిపోయాడు. అఫ్జల్‌ను దుండగులు కదలలేని స్థితికి వచ్చే వరకు బాదారు. అతను స్పృహ తప్పి పడిపోగానే వారు పారిపోయారు. రక్తమోడుతూ అఫ్జల్ రోడ్డుపై చాలా సేపు అలాగే పడి ఉన్నాడు. స్థానిక వ్యక్తి ఒకతను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దాంతో పోలీసులు వచ్చి అతన్ని ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు.