రోడ్డు కోసం రోడ్డెక్కిన తండావాసులు

రుద్రంగి సెప్టెంబర్ 29 (జనం సాక్షి)
రుద్రంగి మండల కేంద్రంలో గురువారం తమకు రోడ్డు వేయాలని రోడ్డెక్కిన దసరా నాయక్ తాండావాసులు వివరాల్లోకి వెళితే రుద్రంగి మండల కేంద్రంలోని దసరా నాయక్ తండ రోడ్డు మరమ్మత్తు పనులను కాంట్రాక్టర్ గత కొన్ని రోజుల నుండి పనులు చేపట్టారు. రోడ్డుకు మొరం అవసరం ఉండగా ట్రిప్పర్ల సహాయంతో తరలిస్తున్నారు.అట్టి మొరం మండల కేంద్రంలోని 428 సర్వేనెంబర్ అసైన్డ్ భూమి గవర్నమెంట్ సర్వేనెంబర్ లో ఉంది అట్టి భూమి నుండి జెసిపి ద్వారా టిప్పర్లతో రోడ్డుకు అవసరమైన మట్టిని తరలిస్తున్న సమయంలో వాటికి ఎలాంటి అనుమతులు లేవనే సమాచారంతో తాసిల్దార్ భాస్కర్ ఆధ్వర్యంలో జెసిబి మరియు ట్రిప్పర్లను బుధవారం సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో పెట్టారు.దాంతో తాండావాసులు తమ రోడ్డు పనులు ఆగిపోయాయననే ఉద్దేశంతో తాసిల్దార్ కార్యాలయానికి అందరూ చేరుకొని రోడ్డుపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు.అలాగే జెసిబి ఆపరేటర్ను పోలీసులు కొట్టడంతో చేయి విరిగిందని, ఆపరేటర్ పై చేయి చేసుకున్న పోలీస్ పై చర్యలు తీసుకోవాలని తాసిల్దార్ కార్యాలయంలో తమకు న్యాయం జరగాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.జెడ్పిటిసి గట్ల మీనయ్య ఇతర ప్రజా ప్రతినిధులు మరియు తాసిల్దార్ భాస్కర్ సీఐ శ్రీలత,ఎస్ఐ ప్రభాకర్ కాంట్రాక్టర్ ల జోక్యంతో పనులను వెంటనే ప్రారంభించి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పడంతో నిరసన కార్యక్రమం విరమించారు.