రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ధర్మారం : మండలంలోని బొమ్మారెడ్డిపల్లి వద్ద వరంగల్ `రాయపట్నం రాష్ట్ర రహదారిపై కొబ్బరికాయల లారీ చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులను పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన గుంజే కొండాలు (27), పెదవేగి మండలం నడిపల్లికి చెందిన మర్రి దాసులుగా గుర్తించారు. ఏలూరు నుంచి కొబ్బరి కాయల లోడ్‌తో అదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు వెళ్తున్న లారీ అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.