Janam Sakshi - Telugu Daily News Portal > జిల్లా వార్తలు > కరీంనగర్ > Main > రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం / Posted on April 11, 2015
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
కరీంనగర్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మున్సిపల్ కార్మికులు దుర్మరణం చెందారు. జగిత్యాల నుంచి మెట్‌పల్లి వెళ్లే డీసీఎం వ్యాన్.. అదుపుతప్పి పారిశుధ్య పనులు చేస్తున్న కార్మికులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పెద్దరాజం, బొగ్గు నర్సమ్మ అనే కార్మికులు అక్కడిక్కడే చనిపోయారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.