రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఎంబీఏ విద్యార్థుల మృతి
డిచ్‌పల్లి : నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి పరిధిలోని సీఎంసీ అసుపత్రి ఎదుట జాతీయ రహదారిపై ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఎంబీఏ విద్యార్థులు మృతి చెందారు. ఎస్సై నరేశ్ తెలిపిర వివరాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు చెందిన ఎంఏ డానిష్ రహీ(22) , జబీర్ (23)లు హైదరాబాద్‌లోని ప్రైవేటు కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నారు. పరీక్షలు ముగియడంతో ద్విచక్రవాహనంపై స్వస్థలమైన నిర్మల్‌కు బయలుదేరారు. సీఎంసీ అసుపత్రి వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.