రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
చీమకుర్తి: ప్రకాశం జిల్లా ఒంగోలు-నంద్యాల రహదారిలో చీమకుర్తి శివారులోని గంగా లారీ కాటా వద్ద జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కురిచేడుకు చెందిన దూపాటి మద్దిలేటి ధ్విచక్రవాహనంపై వస్తుండగా ఎదురుగా వచ్చిన మినీలారీ ఢీ కొనడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు.