రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
బెజ్జంకి : బెజ్జంకి మండలం గాగిల్లపూర్ రాజీవ్ రహదారి వద్ద హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వస్తున్న మినీ వ్యాన్, కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున& సిమెంట్ మిక్సర్ లారీ ఎదురుగా ఢీకొట్టుకున్నాయి. హైదరాబాద్ సీతాఫల్‌మండి, కొంపల్లికి చెందిన 11 మంది ప్రయాణికులు మినీ వ్యానులో కాలేశ్వరం పుష్కరాలకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన ఏడుగురును 108 వాహనంలో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో బాలమణి (60), సరస్వతి (65), శైలేంద్ర (67), రవీందర్ (42)లు ఉన్నారు. వీరు రెండు కుటుంబాలు కలిసి యాత్రకు వెళ్తున్నట్లు సమాచారం.