రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

 హైద‌రాబాద్  జ‌నంసాక్షి : వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం అలగనూరు దగ్గర ఆటో బోల్తాపడి ఎనిమిది మంది తీవ్రంగా పడ్డారు. ఇక మహబూబ్‌నగర్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మాచారం దగ్గర ఆటో, క్రూజర్‌ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇదే జిల్లా జడ్చర్ల వద్ద నారాయణపేట నారాయణపేట బస్సు డోర్‌ నుంచి ప్రమాదవశాత్తు జారిపడి ఓ వ్యక్తి మృతిచెందాడు.