రోడ్డెక్కిన నిరసన తెలిపిన విద్యార్థులు పి ఎన్ పి ఎస్ నాయకులు

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని పి ఎన్ పి ఎస్ ఆధ్వర్యంలో రోడ్డుపై కూర్చొని  నిరసన తెలిపిన దోమ ప్రభుత్వ పాఠశాల  విద్యార్థులు
దోమ ఆగష్టు 27(జనం సాక్షి)
    తమ పాఠశాలలో వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలని పరిగి నియోజక వర్గ పరిరక్షణ సమితి ( పిఎన్ పి ఎస్) ఆధ్వర్యంలో దోమ ప్రభుత్వ పాఠశాల  విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి  నిరసన తెలిపారు. అనంతరం ప్లే కార్డ్స్ తో ప్రధాన రోడ్ల గుండా ర్యాలీ నిర్వహిస్తూ స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి, డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న సమయంలో అటుగా వెళ్తున్న ఎంపీడీవో జయరాం విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకొని పై అధికారులతో వివరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమానికి బిజెపి సంపూర్ణ మద్దతు తెలిపింది.పి ఎన్ పి ఎస్ వ్యవస్థాపకుడు రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేదని, నిధులు మంజూరు అయిన పనులు ప్రారంభించడం లేదని అన్నారు.ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేక సరైన ఫ్యాకల్టీ లేక, భోజన వసతి సరిగా లేక,శీతలావస్థకు చేరిన భవనాల వాళ్ళ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నేరెక్కినట్టు విద్యార్థుల సమస్యలు పట్టించుకోకుండా విద్యార్థులను పూర్తిగా విస్మరించిందని అన్నారు.పి ఎన్ పి ఎస్ దోమ మండలం అధ్యక్షుడు ప్రతాప్ గౌడ్ మాట్లాడుతూ దోమ పాఠశాలలో అటెండర్ లేక విద్యార్థులకు త్రాగడానికి నీరు లేదని విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, అటెండర్ నియమించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులు మాట్లాడుతూ స్థానిక ప్రజా ప్రతినిధులు పాఠశాలకు వచ్చినప్పుడుఎన్నిసార్లు సమస్యలు చెప్పినా పట్టించుకోవడం లేదని, అటెండర్ లేక కనీసం తాగడానికి కూడా నీళ్లు పెట్టడం లేదని ఇకనైనా తమ సమస్యలు తీర్చాలని పాఠశాల విద్యార్థులు దీనంగా వేడుకుంటున్నారు. బిజెపి మండల అధ్యక్షులు శేరి రాంరెడ్డి, గాదె మైపాల్, పిఎన్ పి ఎస్ కులక్చర్ల అధ్యక్షులు హరికృష్ణ, బీజేవైఎం అధ్యక్షులు గడుసు మహిపాల్, బీజేవైఎం  ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్,పిఎన్ పి ఎస్ సభ్యులు నవీన్ కుమార్ రెడ్డి , చంద్రయ్య, నర్సింలు, రాజు తదితరులు పాల్గొన్నారు.