ర్యాగింగ్‌పై సీరియస్‌గా ఉన్నాం: గవర్నర్
న్యూఢిల్లీ,ఆగస్ట్20(జనంసాక్షి):
గవర్నర్ నరసింహన్ గురువారం సాయంత్రం కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిణామాలను ఆయన రాజ్‌నాథ్‌సింగ్‌కు వివరించినట్లు సమాచారం. భేటీ అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ… ర్యాగింగ్‌పై విద్యాసంస్థలు కఠినచర్యలు తీసుకోవాలని సూచించారు. ర్యాగింగ్ అంశంపై చర్చించేందుకు త్వరలోనే ఇరు రాస్ట్రాల మంత్రులతో సమావేశం కానున్నట్లు తెలిపారు. ర్యాగింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రులకు ఇప్పటికే సూచించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇది సహించరాని నేరమన్నారు.