లంచం డిమాండ్‌ చేస్తే చెప్పండి

వైఎస్‌ జగన్‌ సాహసోపేత నిర్ణయం: విజయసాయి

అమరావతి,నవంబర్‌26(జనం సాక్షి): మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. ‘దేశంలోనే పప్రథమంగా అవినీతిపై ఫిర్యాదుల కోసం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 14400 కాల్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఇటువంటి సాహసం ఇప్పటి వరకు ఏ రాష్ట్రం చేయలేక పోయింది. ఎవరు లంచం అడిగినా, డబ్బులివ్వందే పని జరగదని చెప్పినా ఫోన్‌ చేయొచ్చు. వైఎస్‌ జగన్‌ చెప్పడమే కాదు చేసి చూపారు. వారం రోజుల్లోనే ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి 63 కోట్ల ఆదాయం వచ్చింది. సంవత్సరమంతా చూస్తే ఇది వేల కోట్లలోకి వెళ్తుంది. మరి ఇన్నాళ్లు ఈ రాబడి ఎవరి జేబుల్లోకి వెళ్లింది చంద్రబాబు పచ్చ ఇసుక మాఫియా ద్వారా విూకూ వాటా ముట్టేది. అందుకే ఇసుక కొరతపై ఇంత

రాద్దాంతం చేశారని’ విజయ సాయిరెడ్డి మండిపడ్డారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి నేటితో 70 ఏళ్ళు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పార్లమెంట్‌ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ ఎంపీలు పాల్గొన్నారని విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు.