లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై
గజ్వేల్ : రూ. ఐదువేలు లంచం తీసుకుంటూ మెదక్ జిల్లా బేగంపేట ఎస్సై మురహరి ఏసీబీకి చిక్కారు. దౌల్తాబాద్ మండలం వీరనగర్‌కు చెందిన రామ్‌లాల్ తన గ్రామంలో ఉపాధిహామీ పనుల గొడవకు సంబంధించి ఏప్రిల్ 16న బేగంపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరించేందుకు ఎస్సై రూ.10 వేలు లంచం అడిగాడు. రూ. ఐదువేలు ఇచ్చేందుకు రామ్‌లాల్ ఎస్సైతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో రామ్‌లాల్ సంగారెడ్డి ఏసీబీ అధికారులను అశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు గురువారం పోలీసుస్టేషనులో ఎస్సైకు రూ. ఐదువేలు ఇస్తుండగా అధికారులు పట్టుకున్నారు.