లంపిస్కిన్ వ్యాధి నివారణకు పాడి రైతులు పశువులకు టీకాలు వేయించుకోవాలి

మండల పశు వైద్యాధికారి కేశవ్ అజ్మీర
తిరుమలగిరి(సాగర్),అక్టోబర్20( జనంసాక్షి): పశువులకు లంపిస్కిన్(ముద్ద చర్మ వ్యాధి)  సోకుతున్న నేపథ్యంలో ముందస్తు నివారణ చర్యలో భాగంగా పాడి రైతులు పశువులకు టీకాలు వేయించుకోవాలని మండల పశువైద్యాధికారి కేశవ అజ్మీర సూచించాడు.గురువారం మండలంలోని గరికనట్ తండా,పెద్దబావితండా,గోడుమడక గ్రామాల్లో పశువులకు  లంపిస్కిన్ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో పశువులకు వైరస్ సంబంధిత చర్మ ముద్ధ వ్యాధి అనే మహమ్మారి బారిన పడి అనేక పశువులు చనిపోవడం జరుగుతుందన్నారు.అందువలన ముందస్తు చర్యలో భాగంగా  నెల రోజులుగా మండలంలోని అన్ని గ్రామాల్లోని పశువులకు వ్యాక్సినేషన్(టీకాలు)వేయడం జరుగుతుందన్నారు.అదేవిధంగా ఇప్పటివరకు మండలంలో ఒకవేళ టీకాలు వేయించని గ్రామాలు మరియు వ్యాక్సినేషన్ లో అందుబాటులో లేని పాడి రైతులు ఉంటే వెంటనే పశువైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలని అన్నారు.మండలంలోని పశువైద్య సిబ్బంది అన్ని వేళలో పాడి రైతులకు అందుబాటులో ఉంటారని అవసరమైన వైద్యం పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు బనావత్ కైక బిచ్చ నాయక్,స్వామి నాయక్,ఉప సర్పంచ్ కిషన్ నాయక్,జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ కృష్ణ నాయక్,గోపాలమిత్ర రామయ్య, పశువైద్య సిబ్బంది,పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:@* పశువులకు టీకాలు వేస్తున్న వైద్యాధికారి కేశవ అజ్మీర