లక్ష్మాబ్యారేజ్‌కు తగ్గిన వరద
జయశంకర్ భూపాలపల్లి,జూలై16(జనం సాక్షి ): కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీబ్యారేజీ వద్ద వరద క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం అధికారులు బ్యారేజీ మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ ఇన్ ప్లో, ఔట్ ప్లో 14,46,500 క్యూసెక్కులుగా ఉంది. అటు సరస్వతి(అన్నారం) బ్యారేజీలోని మొత్తం 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ప్లో, ఔట్ ఎª`లో 2,41,891 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.