లక్ష్మిపేట క్షతగాత్రులకు విశాఖలో వైద్యపరీక్షలు
శ్రీకాకుళం, జూలై 20 : లక్ష్మిపేట క్షతగాత్రులను వైద్య పరీక్షల కోసం విశాఖపట్టణంలోని సెవెన్‌హిల్స్ ఆసుపత్రికి తరలించారు. కలెక్టర్ సౌరభ్‌గౌర్ రాజాం చేరుకొని లక్ష్మిపేట బాధితుల్ని పరామర్శించిన సందర్భంలో తమను వైద్య పరీక్షల నిమిత్తం విశాఖపట్నం పంపే ఏర్పాట్లు చేయాలని వారంతా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు కలెక్టర్ ఆదేశాలివ్వడంతో అధికారులు హుటాహుటీన క్షతగాత్రులను విశాఖపట్నం తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. గణపతి, ఎల్లయ్య, రవి, సంఘమేషు, సంగాంలను 108 వాహనంలో విశాఖకు తరలించారు. అంతకు ముందు ఎస్పీహెచ్‌వో చంద్రశేఖర్‌నాయుడు గ్రామాన్ని సందర్శించి క్షతగాత్రులను పరీక్షించారు. క్షతగాత్రుల వెంట స్థానికంగా ఉన్న పొగిరి వైద్యాధికారిని ఊర్మిళ విశాఖ వెళ్లారు.